logo

‘భాజపా గెలిస్తే ప్రజాస్వామ్యానికి ముప్పే’

మరోసారి కేంద్రంలో భాజపా అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడుతుందని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్‌ అన్నారు.

Published : 09 May 2024 03:23 IST

సదస్సులో మాట్లాడుతున్న పరకాల ప్రభాకర్‌

ఖమ్మం ఖానాపురం హవేలీ, న్యూస్‌టుడే: మరోసారి కేంద్రంలో భాజపా అధికారంలోకి వస్తే ప్రజాస్వామ్యానికి ముప్పు ఏర్పడుతుందని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు పరకాల ప్రభాకర్‌ అన్నారు. ‘ప్రస్తుత ఎన్నికలు... మన బాధ్యత’ అనే అంశంపై ఖమ్మంలో బుధవారం నిర్వహించిన సదస్సులో ఆయన మాట్లాడారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలను నిస్సిగ్గుగా కూల్చిన ఘనత భాజపాకు ఉందన్నారు. హైకోర్ట్‌ మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రకుమార్‌ మాట్లాడుతూ  దేశంలో గతం కన్నా అసమానతలు పెరిగిపోయాయని, కొద్దిమంది చేతుల్లోనే కొన్ని వేల బిలియన్‌ డాలర్ల సంపద కేంద్రీకృతమయ్యిందని చెప్పారు. దేశంలో పేదరికం లేదంటున్న ప్రధాని మోదీ.. 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్‌ బియ్యాన్ని ఎందుకు పంపిణీ చేస్తున్నారని ప్రశ్నించారు. రైతు వ్యతిరేక చట్టాలను తీసుకొచ్చిన కేంద్రం, కార్పొరేట్‌ శక్తులకు అనుకూలంగా వ్యవహరించిందని ఆరోపించారు. డాక్టర్‌ ఎం.ఎఫ్‌.గోపినాథ్‌ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఇలియాస్‌, డాక్టర్‌   వై.నాగమణి, ఎస్‌.విజయ్‌, నాగమల్లేశ్వరరావు, పాషా, దేవిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు