logo

రామాలయ అభివృద్ధిపై మంత్రి తుమ్మల సమాలోచనలు

భద్రాచలం రామాలయ అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు. సోలార్‌ విద్యుత్తును సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

Published : 10 May 2024 04:32 IST

రంగనాయకుల గుట్ట నుంచి రామాలయ పరిసరాలను పరిశీలిస్తున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు తదితరులు

భద్రాచలం, న్యూస్‌టుడే: భద్రాచలం రామాలయ అభివృద్ధికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్థానిక ప్రజాప్రతినిధులకు సూచించారు. సోలార్‌ విద్యుత్తును సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. గురువారం ఇక్కడ పర్యటించిన ఈయన రంగనాయకులగుట్ట నుంచి ఆలయ పరిసరాలను పరిశీలించారు. అయోధ్య తరహాలో అన్ని వసతులు కల్పించి దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం ఆలయాన్ని అభివృద్ధి   చేస్తామన్నారు. ఎలాంటి పనులు చేస్తే భక్తులకు సౌకర్యంగా ఉంటుందో సమాలోచనలు జరిపారు. 50 ఇళ్లను తొలగించి ఆలయ ప్రాకారాలు,   మాడ వీధిని విస్తరించాలని అధికారులు భావిస్తున్నారు. దీనిపై సర్వేలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో రంగనాయకులగుట్ట, ధ్యాన మందిరం పరిసరాల నుంచి దేవస్థానం వ్యూ పాయింట్‌ను మంత్రి పరిశీలించారు. గోదావరి వరదల నుంచి భద్రాచలానికి రక్షణగా కరకట్టను విస్తరించే అంశంపై ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కాంగ్రెస్‌ నాయకులు తోటకూర రవిశంకర్‌, రసూల్‌, యశోద రాంబాబుతో చర్చించారు. లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని