logo
Published : 30/11/2021 03:27 IST

ట్రావెల్స్‌ బస్సు దగ్ధం

మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది

కలిదిండి,న్యూస్‌టుడే: మండలంలోని గుర్వాయపాలెంలో ట్రావెల్స్‌ టెంపో బస్సు దగ్ధమైన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. అగ్నిమాపక అధికారులు తెలిపిన వివరాల మేరకు.....గుర్వాయపాలెం పెట్రోల్‌ బంకు సమీపంలోని ఓ ఖాళీ స్థలంలో ఏపీ 37 టీసీ 2224 నంబరు గల ట్రావెల్స్‌ టెంపో బస్సును ఎవరో నిలిపి వెళ్లిపోయారు. ఈక్రమంలో వాహనంలో నుంచి మంటలు రావడంతో స్థల యజమాని గుర్తించి, కైకలూరు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక అధికారి క్రాంతికుమార్‌, సిబ్బంది రాఘవులు, పరశురామ్‌, గణేష్‌, స్వామి మంటలను అదుపు చేశారు. ఘటనలో ఎటువంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో స్ధానికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం జరగటానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

Read latest Krishna News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని