logo
Published : 04 Dec 2021 04:45 IST

రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి

అశోక్‌ (పాతచిత్రం)

ఆత్మకూరు, న్యూస్‌టుడే : మండల పరిధిలోని శ్రీపతిరావుపేట, అమలాపురం గ్రామాల మధ్య కర్నూలు గుంటూరు ప్రధాన రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. సిద్ధాపురానికి చెందిన అశోక్‌, ప్రతాప్‌ ద్విచక్రవాహనంపై ఆత్మకూరు నుంచి స్వగ్రామానికి బయలుదేరారు. ఇదే సమయంలో ఇస్కాలకు చెందిన చాంద్‌ ద్విచక్రవాహనంపై ఆత్మకూరు వైపు వస్తున్నారు. వీరి వాహనాలు ఎదురుపడి ఢీకొనడంతో అశోక్‌ (18) అక్కడికక్కడే మృతి చెందాడు. వెనక కూర్చున్న ప్రతాప్‌కు స్వల్ప గాయాలయ్యాయి. మరో వాహనంలో ఉన్న చాంద్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఇతని పరిస్థితి విషమంగా ఉండటంతో ఆత్మకూరు ఆస్పత్రి వైద్యులు కర్నూలుకు రెఫర్‌ చేశారు. ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో ఆ తల్లి గుండెలవిసేలా రోదించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

Read latest Kurnool News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :
వీక్షకులకు గమనిక
ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు/ సేవల గురించి ఈనాడు సంస్థకి ఎటువంటి అవగాహనా ఉండదు. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి, జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు/ సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు.

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని