logo

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల పరిశీలన

పోలకల్లు, గొల్లల దొడ్డి గ్రామాల్లో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ జి. కృష్ణ కాంత్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

Published : 23 Apr 2024 21:14 IST

సి.బెళగల్ గ్రామీణం: పోలకల్లు, గొల్లల దొడ్డి గ్రామాల్లో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎస్పీ జి. కృష్ణ కాంత్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రెవెన్యూ అధికారులు ఏర్పాట్లు చేసిన సౌకర్యాలను పరిశీలించి, పోలీంగ్ సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చేపట్టాల్సిన భద్రత చర్యల గురించి స్థానిక పోలీసు అధికారులకు పలు సూచనలు  చేశారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగే విధంగా  అందరూ సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ సీఐ శ్రీనివాస రెడ్డి, సి. బెలగళ్ పోలీసు స్టేషన్ ఎస్సై తిమ్మారెడ్డి ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు