logo

సైకో పార్టీకి డిపాజిట్‌ కూడా రాదు

ప్రజల్లో ఉత్సాహం చూస్తుంటే ఈసారి సైకో పార్టీకి డిపాజిట్‌ కూడా రాదని అర్థమవుతోందని నంద్యాల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్‌ఎండీ ఫరూక్‌ పేర్కొన్నారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అని ధ్వజమెత్తారు.

Published : 03 May 2024 03:48 IST

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే : ప్రజల్లో ఉత్సాహం చూస్తుంటే ఈసారి సైకో పార్టీకి డిపాజిట్‌ కూడా రాదని అర్థమవుతోందని నంద్యాల తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్‌ఎండీ ఫరూక్‌ పేర్కొన్నారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అని ధ్వజమెత్తారు. నంద్యాల పట్టణంలోని 1, 2, 3, 5వ వార్డుల్లో గురువారం ఫరూక్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు కొనసాగేలా పోరాడతానన్నారు. నంద్యాల ఎంపీగా శబరిని, ఎమ్మెల్యేగా తనను గెలిపించాలని కోరారు. తెదేపా జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్‌, కౌన్సిలర్‌ నాగార్జున, నాయకులు జాకీర్‌, ఖాదర్‌ కింగ్‌, జిలాని, కొమ్మా హరి, రసూల్‌, ఇక్బాల్‌, అజీమ్‌, ఎన్‌ఎండీ.ఫయాజ్‌, ఫాజిల్‌, ఖలీల్‌ తదితరులు పాల్గొన్నారు.

నంద్యాల పట్టణం, న్యూస్‌టుడే : నంద్యాల ఆటోనగర్‌కు 32 ఎకరాల ప్రభుత్వ భూమి ఇచ్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకే దక్కుతుందని నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్‌ఎండీ ఫరూక్‌ పేర్కొన్నారు. ఆటోనగర్‌ అసోసియేషన్‌ నాయకుడు జాకీర్‌ ఆధ్వర్యంలో గురువారం పలువురు తెదేపాలో చేరారు. సంఘం నాయకుడు జాకీర్‌ మాట్లాడుతూ ఆటోనగర్‌ కార్మికుల ఓట్లు సుమారు 30 వేలు ఉన్నాయని, ఇవన్నీ తెదేపాకే పడతాయన్నారు. తెదేపా రాష్ట్ర కార్యదర్శి తులసిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఫిరోజ్‌ పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని