logo

7వ తేదీకల్లా ఓటరు చీటీల పంపిణీ

ఫెసిలిటేషన్‌ సెంటర్లు, హోమ్‌ ఓటింగ్‌ ప్రక్రియ నిర్వహణలో ఎలాంటి పొరబాట్లు జరగకూడదని జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్‌ డా.జి.సృజన ఆదేశించారు. ఆమె పలు అంశాలపై రిటర్నింగ్‌ అధికారులతో శనివారం టెలీ కాన్ఫరెన్సులో సమీక్షించారు.

Published : 05 May 2024 02:57 IST

జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్‌ డా.జి.సృజన

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : ఫెసిలిటేషన్‌ సెంటర్లు, హోమ్‌ ఓటింగ్‌ ప్రక్రియ నిర్వహణలో ఎలాంటి పొరబాట్లు జరగకూడదని జిల్లా ఎన్నికల అధికారిణి, కలెక్టర్‌ డా.జి.సృజన ఆదేశించారు. ఆమె పలు అంశాలపై రిటర్నింగ్‌ అధికారులతో శనివారం టెలీ కాన్ఫరెన్సులో సమీక్షించారు. ఎన్నికల విధుల్లో ఉన్న సిబ్బంది తమకు ఓటు హక్కు కలిగి ఉన్న అసెంబ్లీ నియోజకవర్గంలో ఏర్పాటుచేసిన ఫెసిలిటేషన్‌ కేంద్రానికి వెళ్లి ఓటు హక్కు వినియోగించుకోవాలని, ఇతర జిల్లాల్లో ఓటు ఉన్నవారైతే వారు పనిచేస్తున్న నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటుచేసిన ఫెసిలిటేషన్‌ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకునేలా తెలియజేయాలని ఆర్వోలను ఆదేశించారు. ఓటరు స్లిప్‌ల పంపిణీ వేగవంతం చేయాలని, మే 7వ తేదీనాటికి పంపిణీ పూర్తిచేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో వంద శాతం వెబ్‌ కాస్టింగ్‌ అమలుచేస్తున్నట్లు పేర్కొన్నారు. 9, 10, 11 తేదీల్లో పెద్దఎత్తున స్వీప్‌ ఓటరు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఈ టెలీ కాన్ఫరెన్సులో పాణ్యం, కర్నూలు, ఆదోని, కోడుమూరు, పత్తికొండ, మంత్రాలయం, ఎమ్మిగనూరు, ఆలూరు నియోజకవర్గాల ఆర్వోలు, నోడల్‌ అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని