logo

ఓటేసిన 19,033 మంది ఉద్యోగులు

జిల్లాలో 19,033 మంది ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలట్‌ను వినియోగించుకున్నారు. మొత్తం మూడు రోజుల్లో 19,033 (84.16 శాతం) మంది ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకోవడం విశేషం.

Published : 09 May 2024 03:32 IST

కర్నూలు సచివాలయం, న్యూస్‌టుడే : జిల్లాలో 19,033 మంది ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలట్‌ను వినియోగించుకున్నారు. మొత్తం మూడు రోజుల్లో 19,033 (84.16 శాతం) మంది ఉద్యోగులు ఓటు హక్కు వినియోగించుకోవడం విశేషం. ఎమ్మిగనూరు, కోడుమూరు, పత్తికొండలో ఉద్యోగులు అత్యధికంగా పోస్టల్‌ బ్యాలట్‌ ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఆదోని, కర్నూలు, మంత్రాలయం, ఆలూరు, పాణ్యంలో తక్కువ మంది ఓటు వేశారు. మరోవైపు నగరంలోని ఆయా పోలింగ్‌ కేంద్రాల వద్ద అధికారులు పర్యవేక్షించారు.

నేడు అవకాశం  

ఓటు హక్కు వినియోగించుకోని ఉద్యోగులు గురువారం హక్కును వినియోగించుకోవచ్చని  కలెక్టర్‌ డా.జి.సృజన తెలిపారు. ఇంతకుముందే అందించిన దరఖాస్తులను మాత్రమే పోస్టల్‌ బ్యాలట్‌కు సంబంధించి పరిగణనలోకి తీసుకుంటామన్నారు. ఇప్పటివరకు 70 శాతం పోలింగ్‌ జరిగిందన్నారు. 85 ఏళ్లకు పైబడిన వృద్ధులు 87 శాతం, దివ్యాంగులు 92 శాతం మంది ఇంటి వద్దే ఓటేశారన్నారు. పాణ్యం, కర్నూలు, ఆదోని, కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆదోని, ఆలూరు, పత్తికొండ రిటర్నింగ్‌ అధికారులు, నోడల్‌ అధికారులు ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని