logo

జగన్‌ మాటలు వినని జనం

నగరంలో ఎస్టీబీసీ కళాశాల ప్రాంతంలో గురువారం నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి జగన్‌ మాటలు వినే వారు కరవయ్యారు. కార్పొరేటర్లు, కొందరు నేతలు సీఎం సభకు మహిళలను తీసుకొచ్చారు

Published : 10 May 2024 03:08 IST

జనం లేక ఖాళీగా సభా ప్రాంగణం: నగరంలో ఎస్టీబీసీ కళాశాల ప్రాంతంలో గురువారం నిర్వహించిన సభలో ముఖ్యమంత్రి జగన్‌ మాటలు వినే వారు కరవయ్యారు. కార్పొరేటర్లు, కొందరు నేతలు సీఎం సభకు మహిళలను తీసుకొచ్చారు. ఒక్కొక్కరికి రూ.150-200 వరకు చెల్లించి ఆటోల్లో సభకు తరలించారు. వారంతా అక్కడికి వచ్చినట్లే వచ్చి వెళ్లిపోయారు.. సీఎం మాట్లాడే సమయానికి ప్రాంగణం జనం లేక వెలవెలబోయింది. ‘‘ ప్రచారానికి వెళ్తే నిత్యం రూ.200 వరకు ఇస్తున్నారు.. ఈరోజు రూ.50 వరకు తగ్గించారని ముజఫర్‌నగర్‌, ఎన్టీఆర్‌ బిల్డింగ్స్‌కు చెందిన పలువురు పేర్కొన్నారు. ఇతరత్రా పనులు లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో గత 20 రోజులుగా ఎన్నికల ప్రచారానికి వెళ్తున్నామన్నారు.

- కర్నూలు, ఈనాడు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు