logo

కొల్లాపూర్‌ ఎమ్మెల్యే ట్విటర్‌ ఖాతా హ్యాక్‌

కొల్లాపూర్‌ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి ట్విటర్‌ ఖాతా హ్యాక్‌ అయింది. శనివారం ఆయన హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ట్విటర్‌ హెల్ప్‌ డెస్క్‌ సెంటర్‌ పేరిట ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డికి ఓ

Published : 17 Jan 2022 01:48 IST

నారాయణగూడ : కొల్లాపూర్‌ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి ట్విటర్‌ ఖాతా హ్యాక్‌ అయింది. శనివారం ఆయన హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. ట్విటర్‌ హెల్ప్‌ డెస్క్‌ సెంటర్‌ పేరిట ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డికి ఓ లింక్‌ వచ్చింది. దానిపై క్లిక్‌ చేయడంతోనే అవతలి వ్యక్తులు కొన్ని ప్రశ్నలు అడిగారు. సమాధానాలు చెప్పడం ముగిసిన కొద్దిక్షణాల్లోనే ‘మీ ట్విటర్‌ ఖాతా బ్లాక్‌ అయింది’ అనే సంక్షిప్త సందేశం వచ్చింది. ఆ తర్వాత ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి పేరులోని ‘బీరం’ను ‘బీర్‌’గా మార్చి.. ఆ ఖాతాలో స్నేహితులుగా ఉన్నవారందరికీ అసభ్య సందేశాలు పంపిస్తున్నారు. దీనిపై ఎమ్మెల్యే హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని