logo

కలెక్టర్‌గా జి.రవి బాధ్యతల స్వీకారం

మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌గా జి.రవి బుధవారం బాధ్యతలు చేపట్టారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది సహకారంతో జిల్లాను మరింత ముందుకు నడిపించేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు.

Published : 02 Feb 2023 04:41 IST

బాధ్యతలు చేపడుతున్న కలెక్టర్‌ రవి

మహబూబ్‌నగర్‌ పట్టణం, న్యూస్‌టుడే : మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌గా జి.రవి బుధవారం బాధ్యతలు చేపట్టారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, సిబ్బంది సహకారంతో జిల్లాను మరింత ముందుకు నడిపించేందుకు కృషి చేస్తానని ఆయన అన్నారు. త్వరలో మహబూబ్‌నగర్‌ జిల్లాపై పూర్తి అవగాహన పెంచుకొని ప్రభుత్వ పథకాలు సమర్థంగా అమలయ్యేలా కృషి చేస్తానన్నారు. సీఎం కేసీఆర్‌, సీఎస్‌ శాంతికుమారి, ఆబ్కారీ, క్రీడల శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. కలెక్టర్‌ను అదనపు కలెక్టర్‌ కె.సీతారామారావుతోపాటు జిల్లా అధికారులు, టీజీవోలు, టీఎన్జీవోలు, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం నాయకులు పుష్పగుచ్చాలిచ్చి స్వాగతం పలికారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని