logo

నాన్న, పెదనాన్నలే స్ఫూర్తి : సురవరం సుధాకర్‌రెడ్డి

నాన్న సురవరం వెంకట్రామిరెడ్డి, పెదనాన్నలు సురవరం ప్రతాపరెడ్డి, రామచంద్రారెడ్డిల స్ఫూర్తితో ఉన్నతంగా రాణించానని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు.

Published : 06 Feb 2023 06:23 IST

సుధాకర్‌రెడ్డితో స్నేహితులు, కుటుంబ సభ్యులు

కంచుపాడు (ఉండవల్లి) : నాన్న సురవరం వెంకట్రామిరెడ్డి, పెదనాన్నలు సురవరం ప్రతాపరెడ్డి, రామచంద్రారెడ్డిల స్ఫూర్తితో ఉన్నతంగా రాణించానని సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి అన్నారు. ఆదివారం కంచుపాడులోని సురవరం వెంకట్రామిరెడ్డి విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మాట్లాడారు. సీపీఐలో సన్మానం చేయించుకునే అలవాటు చాలా తక్కువని, మిత్రులందరూ సత్కరించడం సంతోషకరమన్నారు. తెలంగాణ సాయుధ పోరాటంలో వెంకట్రామిరెడ్డి నిజాం పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేయడంతో తనలో వామపక్ష లక్షణాలు అలవడ్డాయన్నారు. రామచంద్రారెడ్డి నిజాం పాలనకు వ్యతిరేకంగా ఆందోళన చేయడంతో ఆయన ఒక ఏడాదిపాటు జైలు శిక్ష అనుభవించారన్నారు. పార్టీలో చేరినప్పుడు రైట్‌పర్సన్‌వి రాంగ్‌ పార్టీని ఎంచుకున్నావని చాలా మంది అన్నారని కానీ రైట్‌ పార్టీలో ఉన్నాను కాబట్టే రైట్‌పర్సన్‌ని అని చెప్పారు. విజ్ఞాన్‌ పరోవర్‌ ప్రచురణకర్త లక్ష్మీకాంతారెడ్డి, రమేష్‌,లోకేశ్వర్‌రెడ్డి, కపిల్‌, విజయలక్ష్మి, డా.పుష్పలత, డా.రఘువర్ధన్‌, డా.కృష్ణవర్ధన్‌రెడ్డి, రామచంద్రయ్య పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని