logo

పదిలో ప్రభుత్వ విద్యార్థుల ప్రతిభ

పదోతరగతి పరీక్షా ఫలితాల్లో రాజోలి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రతిభ చాటారు. మండలంలో పది విద్యార్థుల ఉత్తీర్ణతాశాతం 74 శాతంగా నమోదైంది.

Published : 30 Apr 2024 17:39 IST

రాజోలి: పదోతరగతి పరీక్షా ఫలితాల్లో రాజోలి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ప్రతిభ చాటారు. మండలంలో పది విద్యార్థుల ఉత్తీర్ణతాశాతం 74 శాతంగా నమోదైంది. ప్రభుత్వ పాఠశాలలకు సంబంధించి మొత్తం 200 మంది పరీక్ష రాయగా, 148 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 52 మంది అణుత్తీర్ణులయ్యారు. రాజోలి ఉన్నత పాఠశాల విద్యార్ధి మనోజ్‌కుమార్ 9.7 జీపీఏ మార్కులతో మండల టాపర్‌గా నిలిచాడు. మాన్రెదొడ్డిలో జయశ్రీ 9.3 జీపీఏ, కేజీబీవీలో అశ్విని 9.2 జీపీఏ మార్కులతో టాపర్‌గా నిలిచారు. ఇక రాజోలి ఉర్దూ మీడియం పాఠశాలలో వందశాతం ఉత్తీర్ణత నమోదైంది. మాన్రెడ్డిలో 79 శాతం, పెద్దతాండ్రపాడులో 73.3 శాతం, రాజోలిలో 69 శాతం ఉత్తీర్ణత నమోదైందని ఆయా పాఠశాలల హెచ్ఎంలు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని