logo

పది ఫలితాల్లో బాలికలదే పైచేయి

రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో జోగులాంబ గద్వాల జిల్లా 81.38 శాతంతో ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో 32వ (చివరి నుంచి రెండో) స్థానంలో నిలిచింది

Published : 01 May 2024 06:36 IST

పది పరీక్షలు రాసివస్తున్న విద్యార్థులు (పాతచిత్రం)
గద్వాల అర్బన్‌, న్యూస్‌టుడే: రాష్ట్ర వ్యాప్తంగా మంగళవారం విడుదలైన పదో తరగతి ఫలితాల్లో జోగులాంబ గద్వాల జిల్లా 81.38 శాతంతో ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో 32వ (చివరి నుంచి రెండో) స్థానంలో నిలిచింది. 7,175 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 5,839 మంది ఉత్తీర్ణులయ్యారు. 3,512 మంది బాలురకు 78.67 శాతంతో 2,763 మంది, 3,663 మంది బాలికలకు 83.97 శాతంతో 3,076 మంది ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలోని 161 పాఠశాలలకు 25 పాఠశాలల్లో నూరు శాతం ఫలితాలు నమోదయ్యాయి. 34 మంది విద్యార్థులు 10 జీపీఏ సాధించినట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఇందిర, పరీక్షల అసిస్టెంట్‌ కమిషనర్‌ శ్రీనివాసులు తెలిపారు. గతేడాది ఫలితాలతో పోలిస్తే ఉత్తీర్ణతా శాతం పెరిగినా స్థానం దిగజారింది. 27 స్థానం నుంచి 32కు పడిపోయింది.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు