logo

నల్లమలకు చేరిన చిరుత

హైదరాబాద్‌ శంషాబాద్‌ విమానాశ్రయ ప్రాంతంలో ఆరు రోజులుగా ప్రజలను హడలెత్తించిన చిరుత ఎట్టకేలకు నల్లమల అటవీ ప్రాంతానికి చేరింది.

Updated : 05 May 2024 06:52 IST

హైదరాబాద్‌ జూ నుంచి నల్లమలకు బోనులో తరలించిన చిరుత

మన్ననూరు (అమ్రాబాద్‌), న్యూస్‌టుడే : హైదరాబాద్‌ శంషాబాద్‌ విమానాశ్రయ ప్రాంతంలో ఆరు రోజులుగా ప్రజలను హడలెత్తించిన చిరుత ఎట్టకేలకు నల్లమల అటవీ ప్రాంతానికి చేరింది. నాగర్‌కర్నూల్‌ జిల్లా మన్ననూరు రేంజ్‌ అటవీ శాఖాధికారి ఈశ్వర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ విమానాశ్రయం ప్రాంతంలో తిరుగుతున్న ఓ చిరుతను గురువారం రాత్రి బోను సాయంతో బంధించారు. అధికారులు దాన్ని జంతు ప్రదర్శనశాలకు తరలించి అన్ని వైద్య పరీక్షలు చేశారు. స్వల్ప గాయాలైన చిరుతకు వైద్య సేవలందించారు. కోలుకున్నట్లు ధ్రువీకరించుకున్న అధికారులు శుక్రవారం రాత్రి ప్రత్యేక వాహనంలో నల్లమల అటవీ ప్రాంతానికి తరలించారు. నల్లమల అటవీ ప్రాంతంలోని గుండం పరిసరాల్లో చిరుతను వదిలారు. కార్యక్రమంలో మన్ననూరు రేంజ్‌ అధికారి ఈశ్వర్‌తో పాటు ఎఫ్‌ఎస్‌ఓ శివకుమార్‌, ఎఫ్‌బీవో మధుసూదన్‌ పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని