logo

భాజపాకు నడిగడ్డ హక్కుల పోరాట సమితి మద్దతు

భాజపా నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి భరత్ ప్రసాద్‌కు నడిగడ్డ హక్కుల పోరాట సమితి తరఫున సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు కన్వీనర్ రంజిత్ కుమార్ తెలిపారు.

Published : 05 May 2024 16:45 IST

రాజోలి: భాజపా నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి భరత్ ప్రసాద్‌కు నడిగడ్డ హక్కుల పోరాట సమితి తరఫున సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు కన్వీనర్ రంజిత్ కుమార్ తెలిపారు. ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ అభ్యర్థి భరత్ ప్రసాద్, పార్టీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి మాట్లాడారు. నడిగడ్డ హక్కుల పోరాట సమితి ప్రజల తరఫున పోరాటం చేస్తూనే ఉంటుదనీ, ఈ సందర్భంగా రంజిత్ కుమార్ అన్నారు. బడుగు, బలహీన వర్గాలకు పెద్దపీట వేసిన భాజపా తరఫున తాము పోరాడటానికి సిద్ధంగా ఉన్నామని అన్నారు. కార్యక్రమంలో భాజపా, నడిగడ్డ హక్కుల పోరాట సమితి నాయకులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని