logo

ఎన్నికల సంఘం వాట్సాప్‌ ఛానల్‌

లోక్‌సభ ఎన్నికల నిర్వహణలో భారత ఎన్నికల సంఘం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించింది.

Updated : 06 May 2024 06:20 IST

భారత ఎన్నికల సంఘం వాట్సాప్‌ ఛానల్‌ ముఖ చిత్రం

న్యూస్‌టుడే, అచ్చంపేట: లోక్‌సభ ఎన్నికల నిర్వహణలో భారత ఎన్నికల సంఘం సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. సాంకేతిక రంగంలో వస్తున్న మార్పులను అందిపుచ్చుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించింది. ప్రతి ఐదేళ్లకోసారి సార్వత్రిక ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఎన్నికలు నిర్వహించినప్పుడల్లా ఏదో ఒక మార్పు కనిపించేలా ఎన్నికల సంఘం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో ఎన్నికల ప్రచారం హోరెత్తుతోంది. ప్రస్తుతం జరుగుతున్న లోక్‌సభ ఎన్నికల్లో అధికారులు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజలు అత్యధికంగా వినియోగిస్తున్న వాట్సాప్‌ను ఉపయోగించుకోవాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ వాట్సాప్‌ ఛానల్‌ ద్వారా ఎన్నికలకు సంబంధించిన వివిధ రకాల సమాచారాన్ని ఓటర్లకు అందించేందుకు శ్రద్ధ తీసుకుంటున్నారు. ఓటరు చైతన్య కార్యక్రమాలు, ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించే చిత్రాలు, వీడియోలు, వివిధ యాప్‌ల వివరాలను దీనిలో పొందుపరచారు. సీ-విజిల్‌, సువిధ, సాక్ష్యం, కేవైసీ తదితర యాప్‌లు, ఎన్నికలకు సంబంధించిన సమగ్ర వివరాలను సులభంగా తెలుసుకునేలా ఏర్పాట్లు చేశారు. ఎన్నికల సంఘం క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి ఎన్నికలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకునే వెసులుబాటు కల్పించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని