logo

మహిళలను వేధిస్తే కఠిన చర్యలు

జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కళాశాల ఆవరణలో ఓపెన్‌ ఇంటర్‌ పరీక్షలు రాయడానికి వచ్చిన విద్యార్థులకు షీటీం పోలీసులు పలు సామాజిక అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

Published : 07 May 2024 02:58 IST

పాతబస్టాండ్‌(నారాయణపేట), న్యూస్‌టుడే : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ కళాశాల ఆవరణలో ఓపెన్‌ ఇంటర్‌ పరీక్షలు రాయడానికి వచ్చిన విద్యార్థులకు షీటీం పోలీసులు పలు సామాజిక అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. షీ టీం ఏఎస్సై శ్రీదేవి మాట్లాడుతూ.. మహిళలను వేధింపులకు గురిచేసినా, ప్రేమ పేరుతో వేధించినా వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. వేధిస్తే రక్షణ కోసం షీ టీం పోలీసులను సంప్రదించాలని వివరాలకు 87126 70398కు సమాచారం ఇవ్వాలని కోరారు. సైబర్‌ నేరాలకు పాల్పడితే 1930కు సమాచారం ఇవ్వాలని సూచించారు. సిబ్బంది బాలరాజు, సమీనా, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని