logo

అందరికీ పోస్టల్‌ బ్యాలెట్‌

లోక్‌సభ ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న అందరికీ పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తూ జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాలు జారీ చేశారు.

Published : 07 May 2024 03:06 IST

అచ్చంపేట, న్యూస్‌టుడే: లోక్‌సభ ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న అందరికీ పోస్టల్‌ బ్యాలెట్‌ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని కల్పిస్తూ జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాలు జారీ చేశారు. కొంత మంది ఉపాధ్యాయులు, ఉద్యోగుల పేర్లు ఆన్‌లైన్‌లో లేవన్న కారణంతో పోస్టల్‌ బ్యాలెట్‌ ఇచ్చేందుకు సంబంధిత అధికారులు నిరాకరిస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో ప్రత్యేక నిర్ణయం తీసుకున్నారు. ఆన్‌లైన్‌లో పేర్లు లేని వారంతా ఫారం-12తో పాటు ఎన్నికల విధుల నియామక పత్రం జత చేసి సంబంధిత అసెంబ్లీ నియోజకవర్గం అధికారికి అందజేస్తే పోస్టల్‌ బ్యాలెట్‌ ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న వారికి ఏ అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఓటు ఉందో అక్కడి అధికారిని కలిసి పత్రాలు అందజేస్తే వెంటనే పోస్టల్‌ బ్యాలెట్‌ ఇచ్చేలా ఆదేశాలు జారీ చేశారు. ఈ నెల 8లోగా వంద శాతం పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు పోలయ్యేలా ఉన్నతాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని