logo
Published : 29/11/2021 01:31 IST

వనదుర్గమ్మకు జన హారతి

ఏడుపాయలలో బోనాలతో భక్తులు

పాపన్నపేట, న్యూస్‌టుడే: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గా భవానీ ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. సెలవు దినం కావడంతో జిల్లా వాసులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ పరిసరాలు అమ్మ నామస్మరణతో మార్మోగాయి. తెల్లవారుజామున 5.30 గంటలకు అర్చకులు మాతకు అభిషేకం, సహస్రనామార్చన నిర్వహించారు. మంజీరా నదిలో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా బోనాలు, ఒడిబియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. కార్తిక మాసం పురస్కరించుకుని పలువురు ఆలయం వద్ద దీపాలు వెలిగించారు. ఈవో సార శ్రీనివాస్‌ ఆధ్వర్యంలో సిబ్బంది ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఏడుపాయల ఔట్‌పోస్ట్‌ పోలీసు సిబ్బంది బందోబస్తు చేపట్టారు.


కౌడిపల్లి పోచమ్మ ఆలయంలో..

తునికిలో పూజలు చేస్తూ..

కౌడిపల్లి: జిల్లాలో ప్రసిద్ధి చెందిన కౌడిపల్లి మండలం తునికి నల్లపోచమ్మ ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ఉమ్మడి జిల్లాతో పాటు జంట నగరాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఒడిబియ్యంతో పాటు బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. అంతకు ముందు బోనాల ఊరేగింపు నిర్వహించారు. పూజారులు శివ్వప్ప, రాజేశ్‌ మాతకు ప్రత్యేక పూజలు చేశారు. ఈవో మోహన్‌రెడ్డి, జూనియర్‌ సహాయకుడు వెంకట్‌రెడ్డి, సిబ్బంది కలిసి తగిన సౌకర్యాలు కల్పించి పర్యవేక్షించారు.


లక్ష్మీ నరసింహ స్వామికి విశేష పూజలు

సికింద్లాపూర్‌లో..

శివ్వంపేట: మండలంలోని సికింద్లాపూర్‌ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో కార్తిక మాసం ఆదివారం సందర్భంగా పూజారులు ధనుంజయశర్మ, విద్యాకర్‌చారి కలిసి విశేష పూజలు చేశారు. ఈ సందర్భంగా కోనేరులో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకున్నారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి.

Read latest Medak News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని