logo
Published : 29/11/2021 01:31 IST

స్పందించి.. వెలుగులు నింపి..

వెలుగుతున్న విద్యుత్తు దీపాలు

మెదక్‌ టౌన్‌, న్యూస్‌టుడే: మెదక్‌ పట్టణంలోని మెదక్‌-హైదరాబాద్‌ ప్రధాన రహదారి మధ్యలో ఏర్పాటు చేసిన బటర్‌ఫ్లై విద్యుత్తు దీపాలు వెలగక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై ‘జిల్లా కేంద్రం.. అంధకారం’ శీర్షికన ‘ఈనాడు’లో ఈనెల 22న ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఈ మేరకు పట్టణంలోని రాందాస్‌ చౌరస్తా నుంచి పాత బస్టాండ్‌ వరకు ఉన్న విద్యుత్తు దీపాలకు మరమ్మతులు చేయించగా అవి వెలుగుతున్నాయి. దీంతో పట్టణవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


సుందరీకరణ పనులు షురూ..

రాందాస్‌ చౌరస్తాలో పనులు చేస్తూ..

జిల్లా కేంద్రంలోని ప్రధాన చౌరస్తాల సుందరీకరణ పనులు అసంపూర్తిగా ఉండడంపై ‘కూడళ్లు.. కుదురుకునేదెన్నడు..’ శీర్షికన ‘ఈనాడు’లో గత నెల 22న ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఈ మేరకు పట్టణంలోని రాందాస్‌ చౌరస్తా వద్ద నిర్మాణ పనులు ప్రారంభించారు.


చెత్త తొలగించారు..

మెదక్‌-బోధన్‌ రహదారి పక్కన శుభ్రం చేశారిలా..

మెదక్‌ పట్టణంలోని ప్రధాన చౌరస్తాలు, రహదారుల పక్కన, ఖాళీ స్థలాల్లో చెత్త పేరుకుపోయింది. దీంతో పట్టణవాసులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై ‘ఎక్కడి చెత్త అక్కడేనా..?’ శీర్షికన ‘ఈనాడు’లో ఈనెల 16న ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఈ మేరకు పట్టణంలోని మెదక్‌-బోధన్‌ ప్రధాన రహదారి పక్కన ఉన్న చెత్తను తొలగించి శుభ్రం చేశారు. దీంతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read latest Medak News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని