logo

ప్రజావ్యతిరేక విధానాలపై పోరాటం: కాంగ్రెస్‌

ఆంగ్లేయుల హస్తాల నుంచి దేశాన్ని విడిపించేందుకు మహాత్మాగాంధీ, నెహ్రూ, సుభాష్‌చంద్రబోస్‌ వంటి మహానీయుల సుదీర్ఘ పోరాట ఫలితంగానే ఇప్పుడు స్వాతంత్య్ర వజ్రోత్సవాలను నిర్వహించుకుంటున్నామని మాజీ ఉప ముఖ్యమంత్రి,

Published : 14 Aug 2022 01:46 IST

టి.లింగంపల్లిలో పాదయాత్ర నిర్వహిస్తున్న దామోదర రాజనర్సింహ

రేగోడ్‌, అల్లాదుర్గం, న్యూస్‌టుడే: ఆంగ్లేయుల హస్తాల నుంచి దేశాన్ని విడిపించేందుకు మహాత్మాగాంధీ, నెహ్రూ, సుభాష్‌చంద్రబోస్‌ వంటి మహానీయుల సుదీర్ఘ పోరాట ఫలితంగానే ఇప్పుడు స్వాతంత్య్ర వజ్రోత్సవాలను నిర్వహించుకుంటున్నామని మాజీ ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల మేనేజ్‌మెంట్‌ కమిటీ ఛైర్మన్‌ దామోదర రాజనర్సింహ అన్నారు. శనివారం ఆజాదీకా గౌరవ్‌యాత్రలో భాగంగా రేగోడ్‌ మండలం టి.లింగంపల్లిలో పాదయాత్ర చేపట్టారు. రేగోడ్‌ వరకు కొనసాగించారు. మండల కేంద్రంలో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్య్ర స్ఫూర్తితో కాంగ్రెస్‌ పార్టీ దేశ సమాజహితానికి పాటుపడుతోందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కాంగ్రెస్‌తోనే సాధ్యమైందన్నారు. స్వేచ్ఛ, సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నేటి యువతదేనని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేసేందుకే పాదయాత్ర చేపట్టినట్లు చెప్పారు. పార్టీ మండలాధ్యక్షుడు దిగంబర్‌రావు, ఉపాధ్యక్షుడు సంగమేశ్వర్‌, ఎంపీపీ సరోజన, జడ్పీటీసీ సభ్యుడు యాదగిరి, టీపీసీసీ సభ్యుడు కిషన్‌ తదితరులున్నారు. అల్లాదుర్గం మండలంలోనూ పాదయాత్ర కొనసాగింది. గడిపెద్దాపూర్‌లో గాంధీ, అంబేడ్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేశారు. అల్లాదుర్గంకు చెందిన స్వాతంత్ర సమరయోధుడు ఈశ్వరయ్యను సత్కరించారు. అన్ని వర్గాల ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్న తెరాస ప్రభుత్వాన్ని గద్దె దించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. పార్టీ మండల అధ్యక్షుడు శేషారెడ్డి, ఎస్సీ సెల్‌ మండల అధ్యక్షుడు బల్‌రామ్‌, జలీల్‌, సాయిలు, సదానందం, తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని