logo

దూడలపై దాడి చేసింది చిరుతే: అటవీ అధికారి

వారం రోజుల్లో నాలుగు దూడలపై దాడి చేసింది చిరుత పులేనని అటవీ రేంజ్‌ డిప్యూటీ అధికారి పి.నీలేందర్‌రావు అన్నారు. సోమవారం తెల్లవారుజామున దుబ్బాక పురపాలిక పరిధి మల్లయ్యపల్లిలో, ఆరు రోజుల క్రితం మండలంలోని కమ్మర్‌పల్లి, అచ్చుమాయిపల్లి, పరశురాంనగర్‌ సిరిసిల్లలోని చీకోడ్‌లో లేగ దూడలపై చిరుత పులి దాడి చేసింది.

Published : 04 Oct 2022 02:56 IST

మల్లయపల్లిలో పాద ముద్ర

దుబ్బాక, న్యూస్‌టుడే: వారం రోజుల్లో నాలుగు దూడలపై దాడి చేసింది చిరుత పులేనని అటవీ రేంజ్‌ డిప్యూటీ అధికారి పి.నీలేందర్‌రావు అన్నారు. సోమవారం తెల్లవారుజామున దుబ్బాక పురపాలిక పరిధి మల్లయ్యపల్లిలో, ఆరు రోజుల క్రితం మండలంలోని కమ్మర్‌పల్లి, అచ్చుమాయిపల్లి, పరశురాంనగర్‌ సిరిసిల్లలోని చీకోడ్‌లో లేగ దూడలపై చిరుత పులి దాడి చేసింది. రెండు చనిపోయాయి. ఆరు రోజుల క్రితం ఘటన జరిగినపుడు చిరుత కాకపోవచ్చని హైనా, నక్క లాంటివి అయి ఉండొచ్చని భావించారు. సోమవారం తెల్లవారుజామున మల్లయ్యపల్లి శివారు గుట్టల మార్గంలో బెల్లే పెద్దనర్సయ్యకు చెందిన లేగదూడను చంపేయడంతో ఆధారాలను బట్టి చిరుత అని నిర్ధారించారు. నీలేందర్‌రావు, బీట్‌ అధికారి శ్రీకాంత్‌, సిబ్బంది వచ్చి పంచనామా చేశారు.  మల్లయ్యపల్లి, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అడవిలో నిఘా నేత్రాలను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. శివారులో పశువులను కట్టేయొద్దన్నారు. రాత్రి పూట అడవిలోకి వెళ్లవద్దని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని