logo

సర్కారు నిధులతో ఆలయాల పునరుద్ధరణ

దేశంలో ఆలయాల నిధులను ప్రభుత్వాలు వాడుకున్నాయని, మన రాష్ట్రంలో మాత్రం సర్కారు నిధులతో పునరుద్ధరణ జరుగుతోందన్నారు.

Published : 02 Dec 2022 02:02 IST

శ్రీరామ పట్టాభిషేకంలో పాల్గొన్న మంత్రి హరీశ్‌రావు, శ్రీనిత దంపతులు

సిద్దిపేట, న్యూస్‌టుడే: దేశంలో ఆలయాల నిధులను ప్రభుత్వాలు వాడుకున్నాయని, మన రాష్ట్రంలో మాత్రం సర్కారు నిధులతో పునరుద్ధరణ జరుగుతోందన్నారు. రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖల మంత్రి హరీశ్‌రావు అన్నారు. యాదాద్రి లక్ష్మీ నృసింహస్వామి క్షేత్రాన్ని సీఎం కేసీఆర్‌ పునరుద్ధరణ చేయడం అందుకు నిదర్శనమన్నారు. సిద్దిపేటలో శ్రీకృష్ణ కాలచక్రం పేరిట 13 రోజులుగా నిర్వహిస్తున్న విశ్వశాంతి మహాయాగ మహోత్సవంలో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. శ్రీకృష్ణ పీఠాధిపతి కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామి నేతృత్వంలో గురువారం శ్రీరామ పట్టాభిషేకం నిర్వహించారు. మంత్రి హరీశ్‌రావు, సతీమణి శ్రీనిత సమేతంగా హాజరయ్యారు. అయుత చండీ హోమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. భగవంతుడి ఆశీస్సులు, సీఎం కేసీఆర్‌ కృషి ఫలితంగా రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తోందన్నారు. 2013లో స్వామి నేతృత్వంలో సిద్దిపేటలో యాగాన్ని నిర్వహించారని, ఏడాది వ్యవధిలోనే స్వరాష్ట్రం సిద్ధించిందన్నారు. ఉదయం వేళ జిల్లా పాలనాధికారి ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ సతీసమేతంగా హోమం చేపట్టారు. నేటితో మహాక్రతువు ముగియనుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని