logo

చెక్‌డ్యాంలు నిర్మిస్తే మేలు

భూగర్భ జలాల పెంపు, సమీప ప్రాంతాల రైతులకు సాగునీటికి ఉపయోగపడేందుకు చెక్‌డ్యాంల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.

Published : 09 Feb 2023 01:59 IST

అల్వాల నుంచి దిగువకు ప్రవహిస్తున్న గోదావరి నీరు
న్యూస్‌టుడే, మిరుదొడ్డి

భూగర్భ జలాల పెంపు, సమీప ప్రాంతాల రైతులకు సాగునీటికి ఉపయోగపడేందుకు చెక్‌డ్యాంల నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ నేపథ్యంలో కొండపోచమ్మ సాగర్‌ జలాశయ నిర్మాణంతో గజ్వేల్‌ మండలం కొడకండ్ల వద్దనున్న పంప్‌హౌస్‌ నుంచి కూడవెల్లి వాగులోకి గోదావరి నీటిని అధికారులు, ప్రజాప్రతినిధులు ఈనెల 4న విడుదల చేశారు. గజ్వేల్‌ నియోజకవర్గం జగదేవ్‌పూర్‌ మండలం చేబర్తి నుంచి ప్రారంభమైన వాగునుంచి గోదావరి జలం జీవధారగా మారింది. గజ్వేల్‌, తొగుట, మిరుదొడ్డి, దుబ్బాక మండలాల పరిధిలో 60 కి.మీ.దూరం ప్రయాణిస్తోంది. ఈ మేరకు గత ప్రభుత్వాల హయాంలో వాగుపై 38 చెక్‌డ్యాంలను నిర్మించారు. దీంతో భూగర్భ జలాలు పెరగడంతో 40 వేల ఎకరాలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా అందుతున్నాయి. ఈ వాగుపై మరో 10 చెక్‌డ్యాంలు నిర్మించాలని రైతులు కోరుతున్నారు. మరో 10 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డికి మిరుదొడ్డి మండలంలోని లింగుపల్లి, మోతె, రుద్రారం, కాసులాబాద్‌తోపాటు పలు ప్రాంతాల రైతులు విన్నవించారు. మంత్రి హరీశ్‌రావుతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని ఎంపీ హామీ ఇచ్చారు. మరో 10 చెక్‌డ్యాంల నిర్మాణాలకు ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే వ్యవసాయాధారిత నియోజకవర్గం సస్యశ్యామలమవుతుందని అన్నదాతలు అంటున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని