logo

ప్రతి ఫిర్యాదు ఆన్‌లైన్‌లో ఉండాలి: ఎస్పీ

బాధితుల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును ఆన్‌లైన్‌లో తప్పకుండా నమోదు చేయాలని ఎస్పీ రోహిణీప్రియదర్శిని అన్నారు. మంగళవారం ఆమె చేగుంట ఠాణాను తనిఖీ చేశారు.

Published : 22 Mar 2023 01:06 IST

ఠాణాలో దస్త్రాలను తనిఖీ చేస్తున్న రోహిణీప్రియదర్శిని

చేగుంట, న్యూస్‌టుడే: బాధితుల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదును ఆన్‌లైన్‌లో తప్పకుండా నమోదు చేయాలని ఎస్పీ రోహిణీప్రియదర్శిని అన్నారు. మంగళవారం ఆమె చేగుంట ఠాణాను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఠాణాలో పెండింగు కేసులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. పాత నేరస్థులపై నిఘా ఉంచాలన్నారు. రోజు వారీగా కదలికలను గమనించాలన్నారు. బ్లూకోల్ట్స్‌, పెట్రోకార్స్‌తో నిరంతరం పెట్రోలింగ్‌ నిర్వహించాలన్నారు. డయల్‌-100కు ఫోన్‌ వస్తే వెంటనే స్పందించి ఘటనా స్థలికి చేరుకొని బాధితులకు న్యాయం చేయాలని సూచించారు. బాధితుల నుంచి వచ్చే ఫిర్యాదులను ఎట్టి పరిస్థితుల్లో పెండింగులో ఉంచరాదన్నారు. వాహనాలు నడిపే వారు తప్పకుండా అన్ని ధ్రువపత్రాలు కలిగి ఉండాలన్నారు. నిబంధనలను అతిక్రమించేవారిపై చర్యలు తీసుకోవాలన్నారు. వాహనాల చలాన్‌లను వసూలు చేయాలన్నారు. రామాయంపేట సీఐ చంద్రశేఖర్‌రెడ్డి, చేగుంట ఎస్సై ప్రకాశ్‌గౌడ్‌ ఉన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని