Siddipet: ‘మా ఇంటి 17 ఓట్లు హరీశన్నకే..’
సిద్దిపేటలో ఓ భారాస నాయకుడు మంత్రి హరీశ్‌రావుపై ఉన్న అభిమానాన్ని వినూత్నంగా చాటారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఇంటి ఓట్లన్నీ హరీశన్నకే అని ఫ్లెక్సీపై పేర్కొని సిద్దిపేటలోని 20వ వార్డు భారాస అధ్యక్షుడు మహమ్మద్ చాంద్ ప్రదర్శించారు.
సిద్దిపేటలో వార్డు సభ్యుడి ఇంటి ముందు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు
సిద్దిపేటలో ఓ భారాస నాయకుడు మంత్రి హరీశ్‌రావుపై ఉన్న అభిమానాన్ని వినూత్నంగా చాటారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఇంటి ఓట్లన్నీ హరీశన్నకే అని ఫ్లెక్సీపై పేర్కొని సిద్దిపేటలోని 20వ వార్డు భారాస అధ్యక్షుడు మహమ్మద్ చాంద్ ప్రదర్శించారు. ఇతర పార్టీల వారు తమ ఇంటికి ప్రచారానికి రావొద్దంటూ పేర్కొన్నారు. అమ్మానాన్నలు, ఆరుగురు అన్నదమ్ములు, ఇద్దరు చెల్లెళ్లు, ఇతర కుటుంబ సభ్యులు మొత్తంగా 17 మందికి ఇంట్లో ఓట్లున్నాయని చాంద్ వివరించారు.
న్యూస్‌టుడే, సిద్దిపేట
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.