logo

7, 8 తేదీల్లో మాక్‌ పోలింగ్‌పై శిక్షణ

ఎన్నికల విధులు సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్‌ వల్లూరు క్రాంతి పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో పోలింగ్‌ అధికారులు, సహాయ పోలింగ్‌ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు.

Published : 02 May 2024 06:14 IST

అవగాహన కల్పిస్తున్న కలెక్టర్‌ వల్లూరు క్రాంతి, చిత్రంలో అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, శిక్షణ ఐఏఎస్‌ అధికారి మనోజ్‌

సంగారెడ్డి టౌన్‌, న్యూస్‌టుడే: ఎన్నికల విధులు సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్‌ వల్లూరు క్రాంతి పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో పోలింగ్‌ అధికారులు, సహాయ పోలింగ్‌ అధికారులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ నెల 6, 7 తేదీల్లో అదనపు పోలింగ్‌ సిబ్బందికి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇంటి నుంచి ఓటు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఈనెల 2, 3 తేదీల్లో ఓటు వేయించేందుకు ఇప్పటికే సిబ్బందిని నియమించామన్నారు. ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేదిలేదని హెచ్చరించారు. మాక్‌ పోలింగ్‌పై ఈనెల 7, 8 తేదీల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. శిక్షణ కార్యక్రమాలను సిబ్బంది సద్వినియోగం చేసుకోవాలని, సందేహాలుంటే నివృత్తి చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, శిక్షణ ఐఏఎస్‌ అధికారి మనోజ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని