logo

మన భవితను నిర్ణయిస్తుంది

మనం వేసే ఓటు ఐదేళ్ల భవిష్యత్తుకు సంబంధించినది. మన భవితను నిర్ణయిస్తుంది. నోటు, మద్యం వంటి ప్రలోభాలకు లొంగొద్దు. లేదంటే మనల్ని మనం అమ్ముకున్నట్లే. ఓటు విషయంలో కులం, మతం, బంధుప్రీతిని అనుసరించొద్దు.

Published : 05 May 2024 01:18 IST

- యెల్ద్దండి వేణు, సినీ నటుడు, దర్శకుడు

మనం వేసే ఓటు ఐదేళ్ల భవిష్యత్తుకు సంబంధించినది. మన భవితను నిర్ణయిస్తుంది. నోటు, మద్యం వంటి ప్రలోభాలకు లొంగొద్దు. లేదంటే మనల్ని మనం అమ్ముకున్నట్లే. ఓటు విషయంలో కులం, మతం, బంధుప్రీతిని అనుసరించొద్దు. ప్రలోభాలు, ఒత్తిళ్లకు లొంగకుండా స్వేచ్ఛగా ఓటు వేయాలి. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా వెళ్లి కచ్చితంగా ఓటుహక్కు వినియోగించుకోవాలి. ఆలోచించి సమర్థ నేతకు ఓటేయండి. అప్పుడే నిజమైన నాయకులు ఎన్నికవుతారు.

న్యూస్‌టుడే, హుస్నాబాద్‌ గ్రామీణం


కండువా మారింది.. మాట జాగ్రత్తండి

ఇప్పుడు ఎక్కడ చూసినా పార్టీలు మారుతున్న నాయకులు, కార్యకర్తలు కోకొల్లలుగా కనిపిస్తున్నారు. ఈ రోజు ఓ పార్టీలో ఉంటే మరుసటి రోజు వేరే పార్టీలో చేరుతున్నారు. కండువాలు మార్చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. అంతకుముందు ప్రత్యర్థి పార్టీని దుమ్మెత్తి పోయగా.. ఇప్పుడదే పార్టీలో చేరి జై కొట్టాల్సి వస్తోంది. ఈ క్రమంలో ఆ గట్టు నుంచి ఈ గట్టుకొచ్చామన్న సంగతి మరచి అవతలి వారే జై కొడుతున్న ఘటనలు అడపాదడపా జరుగుతున్నాయి. ఇదే అదునుగా రికార్డు చేసి సామాజిక మాధ్యమాల్లో పెట్టేస్తున్నారు సోషల్‌ మీడియా వాలంటీర్లు. అందుకే ఈ విషయంలో కాస్త పైలంగా ఆలోచించి మాట్లాడితే మంచిది.

న్యూస్‌టుడే, గజ్వేల్‌ గ్రామీణ  


ఓటు హక్కు 21 నుంచి 18 ఏళ్లకు...

అధికరణ 326 ద్వారా సార్వత్రిక వయోజన ఓటు హక్కును 1952లో సాధారణ ఎన్నికల సందర్భంగా కల్పించారు. దీని ద్వారా 21 ఏళ్లు పైబడిన వారు ఓటు హక్కు వినియోగించుకునే వారు. దాన్ని 18 ఏళ్లకు మార్చాలని చాలాకాలంగా వచ్చిన విజ్ఞప్తుల మేరకు 1988లో 61వ రాజ్యాంగ సవరణ ద్వారా అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ హయాంలోని ప్రభుత్వం ఓటు హక్కు వయోపరిమితిని 21 ఏళ్ల నుంచి 18 ఏళ్లకు తగ్గించింది. అప్పటి నుంచి 18 ఏళ్ల వయసు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునే అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది.

పెద్దశంకరంపేట

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని