logo

‘కుబేరులను పోషించిన మోదీ ప్రభుత్వం’

పదేళ్లుగా ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం కుబేరులను పెంచి పోషిస్తూ పేదలపై ఆర్థిక భారాన్ని మోపిందని ప్రజా సంఘాల ఐకాస రాష్ట్ర ఛైర్మన్‌ ఆచార్య కూరపాటి వెంకటనారాయణ అన్నారు.

Updated : 05 May 2024 06:33 IST

సమావేశంలో మాట్లాడుతున్న ఆచార్య వెంకటనారాయణ, ప్రతినిధులు

హుస్నాబాద్‌, న్యూస్‌టుడే: పదేళ్లుగా ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం కుబేరులను పెంచి పోషిస్తూ పేదలపై ఆర్థిక భారాన్ని మోపిందని ప్రజా సంఘాల ఐకాస రాష్ట్ర ఛైర్మన్‌ ఆచార్య కూరపాటి వెంకటనారాయణ అన్నారు. శనివారం హుస్నాబాద్‌లో విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్రం ద్వారా తెలంగాణ ప్రజలకు పరోక్షంగా, ప్రత్యక్షంగా ఆర్థిక ప్రయోజనం చేకూరే పథకాలు ఏవీ అందలేదన్నారు. కార్పొరేటీకరణతో చిరువ్యాపారులు, వృత్తిదారులు తమ వ్యాపారాల్ని కోల్పోయి పేదరికంలోకి జారిపోయారన్నారు. 180 దేశాలతో పోల్చితే 2014లో 128వ స్థానం ఉండగా పదేళ్లలో 136వ స్థానానికి మనదేశం దిగజారిందన్నారు. రాష్ట్రాన్ని భారాస అన్ని రకాలుగా దోపిడీ చేసి వేల కోట్ల సొత్తు సొంతం చేసుకుందని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో భారాసకు ఓటు వేస్తే బొందలో వేసిననట్లేనన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థుల విజయానికి తోడ్పాడాలని కోరారు. ఫులే ఆశయ సాధన  సమితి రాష్ట్ర అధ్యక్షుడు సంగని మల్లేశ్వర్‌, ప్రతినిధులు ఎదులాపురం తిరుపతి, వంగల సుధాకర్‌, సమన్వయకర్త మేకల వీరన్నయాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుందామనే వివరాలున్న కరపత్రాలను ఆవిష్కరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని