logo

సామాజిక మాధ్యమం.. ప్రచారానికి ఊతం

లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్‌ సమీపిస్తుండటంతో మెదక్‌, జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాల్లో అన్ని పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ప్రతి ఓటరును చేరాలన్న ఉద్దేశంతో సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకున్నారు.

Published : 07 May 2024 03:26 IST

న్యూస్‌టుడే, మెదక్‌, గజ్వేల్‌ గ్రామీణ, జహీరాబాద్‌ అర్బన్‌

లోక్‌సభ ఎన్నికల్లో పోలింగ్‌ సమీపిస్తుండటంతో మెదక్‌, జహీరాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గాల్లో అన్ని పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ప్రతి ఓటరును చేరాలన్న ఉద్దేశంతో సామాజిక మాధ్యమాలను వేదికగా చేసుకున్నారు. తక్కువ సమయంలో అత్యధిక ఓటర్లను ప్రభావితం చేసేలా ఫేస్‌బుక్‌, ఎక్స్‌, ఇన్‌స్టాగ్రామ్‌ తదితర వాటిని వినియోగిస్తున్నారు. అభ్యర్థుల పేరిట వారి అభిమానులు, కార్యకర్తలు ఖాతాలు తెరిచి ప్రచార కార్యక్రమాలు, ఇతర వీడియోలను పోస్టు చేస్తున్నారు. ఎండలు తీవ్రంగా ఉండటంతో ఓటర్లను చేరవయ్యేందుకు వీటిని ఎక్కువగా వినియోగించుకుంటున్నారు. ఎప్పటికప్పుడు సమాచారం చేరవేస్తున్నారు. అభ్యర్థులు, నేతలు నిత్యం ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగిస్తున్న ప్రచారం వీడియోలను అప్‌లోడ్‌ చేస్తున్నారు.


  • భారాస నాయకులు మాజీ సీఎం కేసీఆర్‌, హరీశ్‌రావు ప్రసంగాలతో కూడిన వీడియోలు ఎక్కువగా పోస్టు చేస్తున్నారు. గత పదేళ్లలో చేసిన అభివృద్ధికి సంబంధించిన చిత్రాలను పెడుతున్నారు.

  • కాంగ్రెస్‌ తరఫున సీఎం రేవంత్‌రెడ్డి, రాహుల్‌గాంధీ ప్రసంగాలను జతపరుస్తున్నారు. ఆరు గ్యారంటీలపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

  • భాజపా నేతలు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమిత్‌షా, నడ్డా ర్యాలీలు, ప్రసంగాలను అప్‌లోడ్‌ చేస్తున్నారు. కేంద్రం రాష్ట్రానికి ఇచ్చిన నిధులు, అమలు చేసిన పథకాలను  వివరిస్తున్నారు.

పాటల జోరు...: ప్రచారంలో పాటలు అధిక ప్రభావాన్ని చూపుతాయి. అందుకే వీటికే అన్ని పార్టీలు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో పలు పార్టీలు పాటలతో హోరెత్తించాయి. ప్రస్తుత ఎన్నికల్లోనూ పాటలు జోడించి ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగా గెలిస్తే తాము చేసే పనులతో పాటు, ఇతర పార్టీల వైఫల్యాలను వివరించేలా వాటిని రూపొందించారు. మరో వైపు పార్టీ, అభ్యర్థి గొప్పతనం గురించి తెలియజేసేవీ ఉన్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని