logo

మూడు రంగులు ఎగరాలి.. మెతుకు సీమ మురవాలి

ముష్కరుల చేతిలో ఇందిరాగాంధీ తూటాలకు బలైనప్పుడు దేశానికి ప్రధానిగా, మెదక్‌కు ఎంపీగా ఉన్నారని, చివరి శ్వాస, ఆఖరి రక్తపుబొట్టు చిందేవరకు ఈ ప్రాంతానికి ఆమె ప్రాతినిధ]్యం వహించారని.. మెదక్‌ ఎంపీగా కొనసాగుతుండగానే ఆమె కన్ను మూశారని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు.

Updated : 10 May 2024 06:09 IST

నర్సాపూర్‌ సభలో ప్రజలకు అభివాదం చేస్తున్న కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ, చిత్రంలో  సీఎం రేవంత్‌రెడ్డి

నర్సాపూర్‌, నర్సాపూర్‌ రూరల్‌, శివ్వంపేట, వెల్దుర్తి, న్యూస్‌టుడే: ముష్కరుల చేతిలో ఇందిరాగాంధీ తూటాలకు బలైనప్పుడు దేశానికి ప్రధానిగా, మెదక్‌కు ఎంపీగా ఉన్నారని, చివరి శ్వాస, ఆఖరి రక్తపుబొట్టు చిందేవరకు ఈ ప్రాంతానికి ఆమె ప్రాతినిధ]్యం వహించారని.. మెదక్‌ ఎంపీగా కొనసాగుతుండగానే ఆమె కన్ను మూశారని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తుచేశారు. నర్సాపూర్‌లో మెదక్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా గురువారం నిర్వహించిన జనజాతర సభలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీతోపాటు సీఎం ప్రసంగించారు. భాజపా, భారాస నుంచి విముక్తి కలిగించే అవకాశం మీ చేతుల్లోనే ఉంది, ఈ ఎన్నికల ద్వారా ఆ రెండు పార్టీలకు గుణపాఠం చెప్పాలని, అందుకే రాహుల్‌గాంధీ బలహీన వర్గాల బిడ్డ నీలం మధుకు పోటీచేసే అవకాశం కల్పించారని చెప్పారు. మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గానికి దేశ చరిత్రలో గొప్ప పేరుందని, ఆనాడు జనతా పార్టీ విఫలమై దేశ రాజకీయాలు అస్తవ్యస్తంగా మారిన సమయంలో ఇందిరాగాంధీ 1980లో మెదక్‌ నుంచి ఎన్నికల బరిలో¨ నిలిచి అత్యధిక మెజార్టీతో గెలుపొందారన్నారు. ఆ సమయంలో ఆమె దేశానికి ప్రధానిగా ఎన్నికైన విషయం ఇక్కడ ఉన్న ప్రతి మెదక్‌ బిడ్డకు తెలుసన్నారు. భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు దుబ్బాక ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచాక మోదీ నుంచి వేల కోట్లు తెస్తానని మాటలు చెప్పి, దుబ్బాక ప్రజలను మోసం చేశారన్నారు. భూములకు నష్టపరిహారం ఇవ్వండని  అడిగిన రైతులను భారాస అభ్యర్థి వెంకట్రామిరెడ్డి పోలీసులతో కొట్టించారని విమర్శించారు. ఆయనను చిత్తుగా ఓడించాలన్నారు.  కాంగ్రెస్‌ జెండా ఎగరాలి, మెతుకు సీమ మురవాలని పేర్కొన్నారు.

సోనియా, రాహుల్‌, ప్రియాంక, చిత్రపటాలను ప్రదర్శిస్తూ..

శ్రేణుల్లో ఉత్సాహం: జన జాతర బహిరంగ సభలో అగ్రనేత రాహుల్‌, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, పలువురు మంత్రులు  ప్రసంగాలు కార్యకర్తలు, నాయకుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఎండలను సైతం లెక్క చేయకుండా మెదక్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలోని ఏడు నియోజకవర్గాల నుంచి ప్రజలు భారీగా తరలివచ్చారు.

సభలో పదనిసలు

పెన్సిల్‌తో గీసిన రాజీవ్‌గాంధీ చిత్రాన్ని చూస్తున్న రాహుల్‌, సీఎం, మంత్రి సురేఖ

  • సభకు రాహుల్‌గాంధీÅ సాయంత్రం 4.20 గంటలకు హెలికాప్టర్‌లో వచ్చారు. 
  • అగ్రనేత రాహుల్‌, సీఎం రేవంత్‌రెడ్డి అభివాదం చేస్తూ వేదికపైకి వస్తుండగా, సభలో కార్యకర్తలు, నాయకులు కేరింతలు కొట్టారు. 
  • వేదికపైకి రాహుల్‌ రావడానికి ముందు మాజీ ఎమ్మెల్సీ సత్యనారాయణ మాట్లాడారు.
  • సభావేదిక వద్ద ‘గాడిద గుడ్డు’ అనే బొమ్మను ప్రదర్శనకు ఉంచారు. సీఎం ప్రసంగిస్తున్న సమయంలో వాటిని ప్రదర్శించారు. 
  • సభకు పెద్దఎత్తున ప్రజలు తరలివరావడంతో, సభ ముగిశాక వేదిక నుంచి నర్సాపూర్‌ వరకు ట్రాఫిక్‌ స్తంభించింది. 
  • నర్సాపూర్‌ మండలం చిప్పల్‌తుర్తి ఎంపీటీసీ సంధ్యారాణి నాయక్‌, తన నానమ్మ కెస్లీభాయి ఇందిరాగాంధీతో దిగిన చిత్రాన్ని రాహుల్‌గాంధీకి బహూకరించారు. 
  • పటాన్‌చెరుకు చెందిన విద్యార్థి చిట్ల కార్తిక్‌ పెన్సిల్‌తో గీసిన మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ చిత్రపటాన్ని, రాహుల్‌గాంధీకి బహూకరించారు.

మదన్‌రెడ్డిని కేసీఆర్‌ ఏదో అనిపోయిండంట..:

నర్సాపూర్‌కు వచ్చిన కేసీఆర్‌ బస్‌యాత్ర చూస్తుంటే ‘తిక్కలోడు తిరునాళ్లకు పోతుంటే.. ఎక్కడానికి, దిగడానికే సరిపోయిందంట’ అని రేవంత్‌ ఎద్దేవా చేశారు. పెద్దలు మదన్‌రెడ్డిని మాజీ సీఎం కేసీఆర్‌ ఏదేదో అనిపోయిండంట, ఇప్పటికైనా తీరు మార్చుకోవాలని, ప్రజలు ఆయనను తిరస్కరించారన్న విషయాన్ని గమనించాలన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో మెదక్‌ నుంచి పోటీచేస్తున్న భారాస అభ్యర్థి డిపాజిట్‌ గల్లంతు కావడం ఖాయమన్నారు. ఇందుకు నర్సాపూర్‌ నుంచే పునాదులు పడతాయని పేర్కొన్నారు. మీ అందరికి ఒకటే విజ్ఞప్తి, ఇనాళ్లు భాజపా, భారాసను గెలిపించారు, ప్రస్తుత ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు. సభలో మంత్రులు కొండా సురేఖ, దామోదర్‌ మాట్లాడారు. మెదక్‌ ఎమ్మెల్యే రోహిత్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు మైనంపల్లి హన్మంతరావు, మదన్‌రెడ్డి, జగ్గారెడ్డి, డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులుగౌడ్‌, నిర్మలారెడ్డి, నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఆవుల రాజిరెడ్డి, రాష్ట్ర నాయకులు జెట్టి కుసుమకుమార్‌, మాజీ ఎమ్మెల్సీలు రాములునాయక్‌, ఆర్‌.సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

సభకు తరలివస్తున్న ప్రజలు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు