డిజిటల్ సభ్యత్వ నమోదుతో కాంగ్రెస్ బలోపేతం
సూర్యాపేట: సిబ్బందితో మాట్లాడుతున్న కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి
సూర్యాపేట (జమ్మిగడ్డ): డిజిటల్ సభ్యత్వ నమోదుతో కాంగ్రెస్ బలోపేతమవుతుందని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి వినోద్‌రెడ్డి, ఏఐసీసీ డిజిటల్ మీడియా కోఆర్డినేటర్ దీపక్ జాన్‌రెడ్డి అన్నారు. సూర్యాపేటలోని పార్టీ కార్యాయంలో పట్టణ, బ్లాక్, మండల కాంగ్రెస్ అధ్యక్షులతో డిజిటల్ సభ్యత్వ నమోదు పురోగతిపై శుక్రవారం సమీక్ష జరిపారు. సభ్యత్వం తీసుకున్న ప్రతి కార్యకర్తకు రూ.2లక్షల బీమా సౌకర్యం కల్పిస్తుందన్నారు. డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్నయాదవ్, టీపీసీసీ అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వర్‌రావు, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు బైరు శైలేందర్, సూర్యాపేట, కోదాడ, హుజూర్నగర్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజద్‌అలీ, వంగవీటి రామారావు, తన్నీరు మల్లిఖార్జున్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోతి గోపాల్‌రెడ్డి, వేములపల్లి వాసుదేవరావు, అరుణ్ కుమార్, దేశ్‌ముఖ్, గోపాల్‌రెడ్డి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు వీరన్ననాయక్, శ్రీనివాస్‌రెడ్డి, మంజూనాయక్, చిన్న వెంకటరెడ్డి, సుబ్బారావు, నరాల కొండారెడ్డి, కీసర సంతోష్‌రెడ్డి, జైపాల్‌రెడ్డి పాల్గొన్నారు.