logo

తవ్వకాలు జరిపిన వారిపై కేసు నమోదు

గుండ్రాంపల్లి గ్రామ శివారులోని శ్రీరామలింగేశ్వర స్వామి గుట్ట సమీపంలోని పురాతన గొబ్బెలమ్మ దేవతల విగ్రహాలను తొలగించి, గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన నలుగురిపై కేసు నమోదు

Published : 26 Jan 2022 04:40 IST

చిట్యాల గ్రామీణం: గుండ్రాంపల్లి గ్రామ శివారులోని శ్రీరామలింగేశ్వర స్వామి గుట్ట సమీపంలోని పురాతన గొబ్బెలమ్మ దేవతల విగ్రహాలను తొలగించి, గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన నలుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై సైదాబాబ మంగళవారం తెలిపారు. ఈ నెల 21న గ్రామానికి చెందిన కొందరు దేవాదాయ శాఖ పరిధిలోని గొబ్బెలమ్మ దేవతల విగ్రహాలను ఎలాంటి అనుమతులు లేకుండా తవ్వకాలు జరిపినట్లు దేవాదాయ శాఖ ఈవో నాగిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని