దశాబ్ది జిలుగులు.. ప్రగతి పరుగులు
తెలంగాణ చరిత్రలో ముందెన్నడూ లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలనలో రూ.34 వేల కోట్లను సూర్యాపేట జిల్లా సమగ్రాభివృద్ధికి కేటాయించిందని విద్యుత్తు శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి తెలిపారు.
తెలంగాణ అవతరణ దినోత్సవంలో పాల్గొన్న మంత్రి జగదీశ్‌రెడ్డి
కలెక్టరేట్లో జాతీయ జెండాకు వందనం చేస్తున్న కలెక్టర్ వెంకటరావు, అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, తదితరులు
ఉత్సవాలకు హాజరైన జిల్లా అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌కుమార్, బొల్లం మల్లయ్యయాదవ్, శానంపూడి సైదిరెడ్డి, ప్రముఖులు
సూర్యాపేట (తాళ్లగడ్డ), న్యూస్‌టుడే: తెలంగాణ చరిత్రలో ముందెన్నడూ లేనివిధంగా రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిదేళ్ల పాలనలో రూ.34 వేల కోట్లను సూర్యాపేట జిల్లా సమగ్రాభివృద్ధికి కేటాయించిందని విద్యుత్తు శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి తెలిపారు. అందులో వ్యవసాయ రంగానికి, వాటి అనుబంధ విభాగాలకు పెద్దపీట వేసిందని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో కలెక్టర్ వెంకటరావు, ఎస్పీ రాజేంద్రప్రసాద్‌తో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించారు. శాంతికి చిహ్నంగా పావురాలను గాల్లోకి ఎగరవేశారు. అనంతరం కవాతు మైదానంలో ఏర్పాటు చేసిన అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించారు. పోలీసు గౌరవ వందనాన్ని స్వీకరించి మాట్లాడారు.
జాతీయ జెండాకు వందనం సమర్పిస్తున్న మంత్రి జగదీశ్‌రెడ్డి, చిత్రంలో కలెక్టర్ వెంకటరావు, ఎస్పీ రాజేంద్రప్రసాద్
* ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో రాష్ట్రంలో విద్యా, వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలికారు. కొవిడ్ విపత్కర పరిస్థితుల్లో ప్రపంచ ఆర్థిక పరిస్థితిని సంక్షోభంలోకి నెట్టినా ఆ కుదుపు నుంచి అనతికాలంలోనే తెలంగాణ బయటపడి సుస్థిరంగా ముందుకు సాగుతుందంటే ముమ్మాటికీ కేసీఆర్ ఘనత మాత్రమే.
* 2017 నుంచి 2022 మధ్య కాలంలో దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణ అత్యధిక తలసరి ఆదాయ వృద్ధిరేటు 11.08 శాతంతో రికార్డు సృష్టించింది. సూర్యాపేట జిల్లాలో నీటి పారుదల, ఆయకట్ల అభివృద్ధికి రూ.2,445.47 కోట్లు, విద్యుత్తు శాఖకు రూ.1,558.18 కోట్లు, మిషన్ భగీరథకు రూ.1,216 కోట్లు, వవర్కెటింగ్ శాఖ ద్వారా రూ.22.50 కోట్లు ఖర్చు పెట్టాం.
* విద్య, ఆరోగ్య శాఖకు తొమ్మిదేళ్లలో రూ.984.77 కోట్లు, విద్యా శాఖకు కేటాయించిన రూ.417.82 కోట్లతో అభివృద్ధి సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పూర్వం కేవలం ఆరు గురుకులాలు మాత్రమే ఉన్న సూర్యాపేట జిల్లాలో ప్రస్తుతం 19 గురుకులాలు, రెండు డిగ్రీ కళాశాలలను ఏర్పాటు చేశాం.
* మహిళా శిశు సంక్షేమ, వికలాంగులు, వయోవృద్ధుల శాఖకు రూ.74.44 కోట్లు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం పురపాలిక సంఘాల అభివృద్ధికి రూ.556.57 కోట్లు, పట్టణ పేదరిక నిర్మూలనకు రూ.1,456.20 కోట్లు, గ్రామీణాభివృద్ధికి రూ.6,180.90 కోట్లను వెచ్చించాం.
* జిల్లాలో ఇంతటి పురోభివృద్ధిలో ప్రజల భాగస్వామ్యంతో పాటు అధికారుల నిరంతర కృషి ఉంది. శాంతి భద్రతల రంగంలో పోలీసుల పనితీరు ఎంతో మెరుగ్గా ఉంది.
* అనంతరం పరేడ్ గ్రౌండ్‌లో వివిధ శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించారు. చిన్నారులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు, శకటాల ప్రదర్శనను తిలకించారు. అమరవీరుల కుటుంబాలు, ఉద్యమకారులను సన్మానించారు.
* కార్యక్రమంలో జడ్పీ ఛైర్‌పర్సన్ గుజ్జ దీపిక, జిల్లా ఎమ్మెల్యేలు గాదరి కిశోర్‌కుమార్, బొల్లం మల్లయ్యయాదవ్, శానంపూడి సైదిరెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మున్సిపల్ ఛైర్‌పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా అభివృద్ధికి అహర్నిశలు కృషి : కలెక్టర్
సూర్యాపేట కలెక్టరేట్: ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రతి గడపకు చేరేందుకు అధికారులు నిరంతరం శ్రమిస్తున్నట్లు కలెక్టర్ వెంకటరావు తెలిపారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్‌తో కలిసి కలెక్టర్ పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు. జిల్లా అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో అధికారులు ప్రభుత్వ పథకాల అమలుకు పాటుపడాలని సూచించారు. అనంతరం పాఠశాల విద్యార్థులకు రాత పుస్తకాలు, పెన్నులు అందజేశారు. కార్యక్రమంలో సీపీవో వెంకటేశ్వర్లు, డీఆర్డీవో కిరణ్, డీపీవో యాదయ్య, డీఏవో రామారావు నాయక్, డీహెచ్‌వో శ్రీధర్ పాల్గొన్నారు.
సూర్యాపేటలోని జడ్పీ కార్యాలయంలో జాతీయ జెండాను ఎగరవేసి వందనం చేస్తున్న ఛైర్‌పర్సన్ గుజ్జ దీపిక, వైస్ ఛైర్మన్ గోపగాని వెంకటనారాయణ గౌడ్, సీఈవో సురేశ్, తదితరులు
సూర్యాపేట: కాంగ్రెస్ కార్యాలయంలో అవతరణ వేడుకల్లో పాల్గొన్న డీసీసీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న, తదితరులు
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Guntur: తెదేపా మహిళా నేత అరెస్టు.. పోలీసుల తీరును తప్పుబట్టిన న్యాయమూర్తి
-
Shah Rukh Khan: ‘మీ సొట్టబుగ్గపై ముద్దు పెట్టుకోవచ్చా?’.. ఆసక్తికర రిప్లై ఇచ్చిన షారుక్
-
Parvathipuram Manyam: లోయలో పడిన ద్విచక్ర వాహనం.. ముగ్గురి మృతి
-
CBI: అమిత్ షా భరోసా ఇచ్చారు.. సీబీఐ దర్యాప్తు షురూ: సీఎం బీరెన్ సింగ్
-
Hyderabad Metro: గణేశ్ నిమజ్జనం.. మెట్రో రైలు ప్రత్యేక ఏర్పాట్లు
-
Dengue: దేశవ్యాప్తంగా డెంగీ కలవరం.. రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం