logo

సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి: ఎస్పీ

జిల్లాలో లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్పీ చందనా దీప్తి తెలిపారు.

Published : 07 May 2024 07:05 IST

నల్గొండ నేరవిభాగం, న్యూస్‌టుడే: జిల్లాలో లోక్‌సభ ఎన్నికల నిర్వహణకు పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు ఎస్పీ చందనా దీప్తి తెలిపారు. జిల్లాలో ఉన్న 2,600 సిబ్బందితో పాటు ఏడు కంపెనీల కేంద్ర బలగాలు అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 1,677 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా 313 సమస్యాత్మక కేంద్రాలు గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించుకునేలా అన్నిరకాల ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఎన్నికలు పూర్తి అయ్యేవరకు ఆయా పార్టీల నాయకులు, కార్యకర్తలతో పాటు ప్రజలు పోలీసులకు  సహకరించాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని