logo

భారాసకు ఎమ్మార్పీఎస్‌ మద్దతు

భువనగిరి పట్టణంలో ఎమ్మార్పీఎస్‌ నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల సమావేశం సుగుణ మాదిగ అధ్యక్షతన నిర్వహించారు.

Updated : 07 May 2024 16:04 IST

భువనగిరి: భువనగిరి పట్టణంలో ఎమ్మార్పీఎస్‌ నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల సమావేశం సుగుణ మాదిగ అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు చిలుకమారి గణేష్ మాదిగ మాట్లాడుతూ.. తమకు రెండు పార్లమెంట్‌ స్థానాలు కేటాయించిన భారాసకు సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి క్యామ మల్లేశ్‌కు ఓటు వేసి గెలిపించగలరని ఆయన మాదిగలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో చింతల శంకర్, ఊట్ల యాదగిరి, బొట్టు నర్సింగరావు, తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని