logo

కాంగ్రెస్‌ ఇంటింటి ప్రచారం

భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పట్టణంలో మంగళవారం ప్రచారం నిర్వహించారు.

Updated : 07 May 2024 16:05 IST

భువనగిరి: భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని కోరుతూ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి పట్టణంలో మంగళవారం ప్రచారం నిర్వహించారు. పట్టణంలోని పలు వార్డుల్లో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలను అమలు చేసిన విషయాన్ని ఓటర్లకు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ హామీలన్నీ నెరవేరాలంటే ఈ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు. కార్యక్రమంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి పూట్ల ప్రమోద్ కుమార్, మెంబర్ తంగలేపల్లి రవికుమార్, నాయకులు సోమయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని