logo

ఓటు హక్కు వినియోగించుకోవాలి

ఓటు వేయడం మన ప్రాథకమిక బాధ్యత అని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు హనుమంతు కే.జెండగే ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Updated : 07 May 2024 16:19 IST

భువనగిరి: ఓటు వేయడం మన ప్రాథకమిక బాధ్యత అని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టరు హనుమంతు కే.జెండగే ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మంగళవారం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్ హాలులో యాక్షన్ ఎయిడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓటరు చైతన్యం కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను జిల్లా కలెక్టరు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ.. ఓటు వేయడం మన ప్రాథమిక బాధ్యత, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా పార్లమెంట్ ఎన్నికల సందర్బంగా పోలింగ్ రోజున అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని ఆయన కోరారు. ఎన్నికల కమిషన్ సూచించిన 12 రకాల గుర్తింపు కార్డులు.. ఓటరు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డు, ఉపాధి హమీ జాబ్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఫోటోతో కూడిన బ్యాంక్ పాస్ బుక్, పోస్టాఫీసు పాస్ బుక్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, పబ్లిక్ సెక్టార్లలో పనిచేసే ఉద్యోగి గుర్తింపు కార్డు, పాన్ కార్డు, పాస్ పోర్ట్, ఫొటోతో కూడిన పెన్షన్ బుక్, ఆర్.జి.ఐ., ఎన్.పి.ఆర్ కింద పంపిణీ చేసిన స్మార్ట్ కార్డు, ఎం.పి.లు, ఎం.ఎల్.లు, ఎం.ఎల్.సి.లకు అధికారికంగా విడుదల చేసిన గుర్తింపు కార్డులు పోలింగ్ కేంద్రంలో చూపించి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స్వీప్ ప్రచార కార్యక్రమాల నోడల్ అధికారి, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి ఎం.ఎ. కృష్ణన్, వివిధ విభాగాల నోడల్ అధికారులు, యాక్షన్ ఎయిడ్ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి శివలింగం, ఎన్నికల విభాగం సిబ్బంది పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని