logo

నగదు చోరీపై కేసు నమోదు

బాంకు నుంచి తీసుకున్న రూ.10 లక్షల నగదు బీరువాలో భద్రపరిచిన గంట వ్యవధిలో చోరీకి గురైన ఘటనపై దర్గామిట్ట పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు.

Published : 02 Feb 2023 02:24 IST

నెల్లూరు (నేర విభాగం), న్యూస్‌టుడే: బాంకు నుంచి తీసుకున్న రూ.10 లక్షల నగదు బీరువాలో భద్రపరిచిన గంట వ్యవధిలో చోరీకి గురైన ఘటనపై దర్గామిట్ట పోలీసులు బుధవారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పోస్టల్‌ కాలనీలో ఉండే వెంకటరెడ్డి అనే ఉపాధ్యాయుడు అప్పులు తీర్చేందుకు గత నెల 12వ తేదీ బ్యాంకు నుంచి రూ.10 లక్షలు నగదుతీసుకొని ఇంట్లోని బీరువాలో భద్రపరిచారు. మిద్దెపై కాపురం ఉంటున్న తోడల్లుడు ఇంట్లోకి వెళ్లి గంటసేపు వారితో మాట్లాడి తిరిగి వచ్చి చూడగా బీరువాలో రూ.10 లక్షల నగదు కనిపించలేదు.  ఈ సంఘటనపై బుధవారం దర్గామిట్ట పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశారు. తమ ఇంట్లో పనిచేసే పని మనిషిపై అనుమానంగా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌ సీతారామయ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని