logo

నిమ్మ రైతుకు జగన్‌ దగా

అయిదేళ్ల వైకాపా పాలనలో హామీలే తప్ప వాటి అమలుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మెట్టప్రాం తం కావడంతో ఎక్కువ మంది వర్షాధారిత పంటలపైనే ఆధారపడి జీవిస్తున్నారు..

Published : 20 Apr 2024 04:53 IST

వైకాపా పాలనలో కానరాని అనుబంధ పరిశ్రమలు
అయిదేళ్లలో నెరవేరని హామీలు

పొదలకూరు: మార్కెట్‌లో నిమ్మకాయలు గ్రేడింగ్‌ చేస్తున్న రైతులు

అయిదేళ్ల వైకాపా పాలనలో హామీలే తప్ప వాటి అమలుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మెట్టప్రాం తం కావడంతో ఎక్కువ మంది వర్షాధారిత పంటలపైనే ఆధారపడి జీవిస్తున్నారు..

హామీ.. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రైతులకు జలకళ పథకం ద్వారా బోరు, మోటారు, విద్యుత్తు, ఇతర సామగ్రి ఉచితంగా అందిస్తామని పాదయాత్రలో భాగంగా ఇనుకుర్తిలో నిమ్మ రైతులకు అప్పటి ప్రతిపక్షనేత సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ.

వాస్తవం.. అయిదేళ్లలో కొన్ని చోట్ల బోర్లు మాత్రమే వేశారు. కొన్నిచోట్ల చుక్కనీరు పడక నిరుపయోగంగా మారాయి. వేసిన చోట మోటారు, విద్యుత్తు ఇతర సామగ్రి సమకూర్చలేదు. మంత్రి కాకాణి వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నప్పటికీ నిమ్మమార్కెట్‌ అభివృద్ధికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కనీసం నిమ్మ ఆధారిత పరిశ్రమ ఒక్కటి కూడా ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు.  

న్యూస్‌టుడే, పొదలకూరు

వేల ఎకరాల్లో నిమ్మసాగు చేసి మార్కెట్‌లో విక్రయించి పలు రాష్ట్రాలకు ఎగుమతులు చేస్తున్నారు.. సాగుదారులకు అవసరమైన వసతులు పూర్తిస్థాయిలో కల్పించి ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్పిన తరువాత పట్టించుకున్న దాఖలాలు లేవు. తరచూ సమావేశాల్లో మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి రైతులకెంతో చేశామని తరచూ సమావేశాల్లో ప్రగల్భాలు పలకడమే తప్ప నిమ్మ ఆధారిత పరిశ్రమల ద్వారా స్థానికులకు ఉపాధి కల్పించడంతో వైకాపా ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది

55 వేల ఎకరాల్లో సాగు..

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పొదలకూరు, రాపూరు, కలువాయి, చేజర్ల, ఆత్మకూరు, మనుబోలు, సైదాపురం ప్రాంతాలతోపాటు గూడూరు డివిజన్లో అన్ని మండలాల్లో నిమ్మ సాగు ఎక్కువగా సాగు చేస్తారు. దిగుబడులకు ధరలున్నా లేకున్నా మార్కెట్‌కు తీసుకొచ్చి విక్రయించాలి. దళారులు, కమీషన్‌ వ్యాపారుల చేతిలో నిత్యం సాగుదారులు మోసపోతున్నారు. ప్రతి ఏటా వేసవిలో మార్చి నుంచి ఆగస్టు వరకు  ఆరు నెలల వరకు ధరలు బాగుంటాయి. మిగతా ఆరు నెలలు డిమాండ్‌ లేక తక్కువ ధరలకు విక్రయిస్తున్నారు.

తెదేపా పాలనలో వసతుల ఏర్పాటు..

నిమ్మ మార్కెట్‌ పరిధిలో 2006లో 20 దుకాణాలు నిర్మించి అర్హులైన రైతులకు అద్దె ప్రాతిపదికన ఇచ్చారు. 2014 తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత యార్డు రూపురేఖలు మారిపోయాయి. భారీ వాహనాలు తిరిగినా కుంగిపోకుండా సిమెంట్‌ రోడ్లు, సైడు కాలువలు నిర్మించారు. 24 కొత్త దుకాణాలు నిర్మించారు. మౌలిక వసతులు కల్పించారు.

అర్హులకు దుకాణాలు కేటాయించాలి.. నిమ్మ యార్డు ఏర్పడిన కొత్తలో కాంగ్రెస్‌ ప్రభుత్వం, 13 ఎకరాల్లో ప్రహరీ నిర్మిస్తే తెలుగుదేశం హయాంలో మంత్రిగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి 24 కొత్త దుకాణాలు, రహదారులు, సైడు కాలువలు, మరుగుదొడ్లు, తాగునీటి సౌకర్యం కల్పించారు. కొత్తగా నిర్మించిన దుకాణాలు వేలం ద్వారా యార్డులో వ్యాపారం చేసుకోనేవారికి కేటాయించాలని నిర్ణయించారు. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత   నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం చేయని వైకాపా శ్రేణులకు కట్టబెట్టడంతో పలువురు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. సాగుదారులకు అనుకూలంగా తీర్పు వచ్చింది. నిమ్మయార్డులో రోజుకు సుమారు 300 మందికి పైగా పనులు చేస్తున్నారు. రైతుల విశ్రాంతి గదిలో ప్రస్తుతం కార్యాలయం నిర్వహిస్తున్నారు.  చెప్పుకోదగ్గ అభివృద్ధి జరగలేదని నిమ్మ మార్కెట్‌ కమిటీ కార్యదర్శి డి.నవీన్‌కుమార్‌ తెలిపారు.

వ్యాపారం చేసేవారికే దుకాణాలు కేటాయించాలి : రామలింగయ్య, రైతు

యార్డులో వ్యాపారం చేసుకునే వారికి దుకాణాలు కేటాయించాలి. బయట వారికి ఎక్కువ ఇచ్చారు. ప్రభుత్వానికి చెల్లించాల్సిన అద్దె కంటే ఎక్కువ వసూలు చేస్తున్నారు. అర్హులంతా చెట్ల కింద ఉంటున్నారు. వర్షమొస్తే వీరి పరిస్థితి ఇబ్బందికరôగా మారింది. అందుకే హై కోర్టును ఆశ్రయించాం. తీర్పు అనుకూలంగా వచ్చింది.

భారీగా నష్టపోయాం: దొరబాబు, రైతు

నిమ్మయార్డులో తాగునీరు, మరుగుదొడ్లు వంటి కనీస వసతులు మెరుగుపరచాలని ప్రజాప్రతినిధులకు విన్నవించినా పట్టించుకోలేదు.  గతేడాది తుపాను ప్రభావంతో సాగుదారులు భారీగా నష్టపోయారు. వారికి పరిహారం అందక అప్పులపాలయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు