logo

జనతాపేట.. సమస్యల మేట

పట్టణంలోని జనతాపేట ఉత్తర, దక్షిణ ప్రాంతాలుగా విస్తరించింది. రైల్వే పట్టాలకు పడమర వైపు ఉంది. రైల్వే శాఖ, పురపాలక సంఘాలకు నడుమ సమన్వయం లేక సమస్యలు పరిష్కారం కావడం లేదు.

Published : 07 May 2024 03:44 IST

కావలి, న్యూస్‌టుడే

పట్టణంలోని జనతాపేట ఉత్తర, దక్షిణ ప్రాంతాలుగా విస్తరించింది. రైల్వే పట్టాలకు పడమర వైపు ఉంది. రైల్వే శాఖ, పురపాలక సంఘాలకు నడుమ సమన్వయం లేక సమస్యలు పరిష్కారం కావడం లేదు. రైల్వే భూమిలో ఉన్న ప్రధాన కాలువలో పూడిక పేరుకుపోయింది. పట్టాలకు వెంబడి ముళ్లపొదలు, పిచ్చిమొక్కలు పెరిగాయి. రైల్వే తరఫున పారిశుద్ధ్య యంత్రాంగంతో శుభ్రం చేయాలన్నది పురపాలక అధికారుల వాదన. అది తమ ప్రయాణికుల ద్వారా వెలువడేది కాదని రైల్వే శాఖ అధికారులు వాదిస్తున్నారు. వీరి వైఖరితో ప్రజలు అవస్థలు పడుతున్నారు.


దోమలతో నిద్రకు దూరం

-తటవర్తి వాసు

దోమల బెడదతో అగచాట్లు పడుతున్నాం. రాత్రిళ్లు నిద్రకు దూరమవుతున్నాం. పురపాలక పారిశుద్ధ్య సిబ్బంది ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టకపోవడంతో దోమల బెడద తీవ్రమవుతోంది. కాలువల్లో తరచూ పూడిక తీస్తేనే, మా ప్రాంతంలో పారిశుద్ధ్యం మెరుగవుతోంది.


ఫాగింగ్‌ యంత్రాలు రావడం లేదు

-శారద

దోమల నివారణ దిశగా చర్యలు లేవు. ఫాగింగ్‌ యంత్రాలు సజావుగా రావడం లేదు. గతంలో  ఓ వాహనం ద్వారా నిర్వహిస్తుండేవారు. ఆ తరువాత అది మరమ్మతులకు గురైందని కొత్తగా తీసుకొచ్చిన యంత్రాలు అప్పుడప్పుడు వస్తున్నాయి. చేతితో పట్టుకొని వాటిని  ప్రస్తుతం తిప్పుతున్నారు.వాటితో పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని