logo

తాడ్వాయి కో-ఆప్షన్‌సభ్యుడి ఎన్నికకు నోటిఫికేషన్‌

జిల్లాలోని తాడ్వాయి మండల పరిషత్‌ కో-ఆప్షన్‌ సభ్యుడి ఎన్నికను నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించింది. ఈ నెల 27వ తేదీన సభ్యుడి ఎన్నికకు సంబంధించి మండలంలోని ఎంపీటీసీ సభ్యులకు నోటీసు ద్వారా సమాచారం అందించనున్నారు.

Published : 23 May 2024 02:02 IST

ఈనాడు, కామారెడ్డి: జిల్లాలోని తాడ్వాయి మండల పరిషత్‌ కో-ఆప్షన్‌ సభ్యుడి ఎన్నికను నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ ప్రకటించింది. ఈ నెల 27వ తేదీన సభ్యుడి ఎన్నికకు సంబంధించి మండలంలోని ఎంపీటీసీ సభ్యులకు నోటీసు ద్వారా సమాచారం అందించనున్నారు. 29వ తేదీన ఉదయం 10 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. మధ్యాహ్నం 12 వరకు నామపత్రాల స్క్రూటినీ చేస్తారు. 1 గంట వరకు నామపత్రాల ఉపసంహరణకు అవకాశం కల్పించనున్నారు. ఆ తర్వాత మండల పరిషత్‌ ప్రత్యేక సమావేశం నిర్వహించి కో-ఆప్షన్‌ సభ్యుడి ఎన్నికను నిర్వహించేందుకు జిల్లా రెవెన్యూ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

ఖాళీగా నాగిరెడ్డిపేట ఎంపీపీ, వైస్‌ఎంపీపీ పదవులు

ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని నాగిరెడ్డిపేట ఎంపీపీ పదవి నాలుగున్నర ఏళ్లుగా ఖాళీగా ఉంటోంది. కొద్దిరోజుల వరకు వైస్‌ ఎంపీపీ రాజ్‌దాస్‌ ఇన్‌ఛార్జి ఎంపీపీగా కొనసాగారు. ఇటీవలే మండలంలోని మెజారిటీ ఎంపీటీసీ సభ్యులు ప్రకటించిన అవిశ్వాసం నెగ్గడంతో ఆయన పదవీ కోల్పోయారు. ప్రస్తుతం మండల పరిషత్‌లో ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ పదవులకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ఎంపీటీసీల పదవీకాలం గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఎన్నికలు నిర్వహిస్తారో లేదో అనే చర్చ ఇప్పటి వరకు ఉండేది. ప్రస్తుతం తాడ్వాయి కో-ఆప్షన్‌ సభ్యుడి ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేసిన నేపథ్యంలో.. జిల్లాలో ఖాళీగా ఉన్న ఎంపీపీ, వైస్‌ ఎంపీపీ పదవులకు లోక్‌సభ ఎన్నికల కోడ్‌ అనంతరం ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని