logo
Published : 27/11/2021 04:55 IST

అష్టముఖి కోనేరులో నేడు పుణ్యస్నానాలు

శనివారం అష్టమి పూజలు చేయనున్న భక్తులు

న్యూస్‌టుడే, ఎడపల్లి


ఆలయంలో మూల విరాట్‌

దక్షిణ భారతదేశంలో ఏకైక అష్టముఖి కోనేరు జానకంపేట లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రాంగణంలో ఉంది. అతి పవిత్రమైన, పురాతమైనది. శనివారం అష్టమి రావడంతో పుణ్యస్నానాలు ఆచరిందుకు భక్తులు పెద్దఎత్తున తరలిరానున్నారు. ఎప్పుడూ నీటితో నిండుగా దర్శనమిస్తుంటుంది. ఇందులో స్నానం చేసి నృసింహుడిని దర్శించుకొంటే సర్వపాపాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.

పురాణాల ప్రకారం..

దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం నృసింహుడు భూమండలానికి వస్తాడు. ఉగ్రరూపం దాల్చి హిరణ్యకశ్యపుడిని సంహరించి దండకారణ్యంలో సంచరిస్తూ జానకంపేట కొండపైకి చేరాక అలసిపోయి సేద తీరుతాడు. ఇది గ్రహించిన రుషులు స్వామిని శాంతింపజేసేందుకు తపస్సు చేస్తారు. కలిపురుషులు(రాక్షసులు)వారికి ఎన్నో ఆటంకాలు కలిగిస్తారు. తట్టుకోలేక రుషులు బ్రహ్మదేవుడిని వేడుకుంటారు. సృష్టికర్త ఆజ్ఞ మేరకు అష్టదిక్పాలకులు ఎనిమిది దిక్కుల్లో కాపలా ఉంటారు. మధ్యలో నీటిని ఉద్బావన చేస్తారు. అలా ఏర్పడిందే అష్టముఖి కొనేరని స్థల పురాణం చెబుతోంది.

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని