logo
Published : 28/11/2021 04:07 IST

విభేదాల్లో ప్రజా వైద్యం

రెండు వర్గాలుగా విడిపోయిన సిబ్బంది

ఈనాడు డిజిటల్‌, కామారెడ్డి

జిల్లా వైద్యశాఖ రెండుగా విడిపోయింది. వైద్యులు, సిబ్బంది మధ్య సమన్వయం లేకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. నాణ్యమైన వైద్యసేవలందించడంపై దృష్టి సారించాల్సిన సిబ్బంది తమ స్వలాభాల కోసం పనిచేస్తున్నట్లు విమర్శలొస్తున్నాయి. ఇటీవల జిల్లాకు పదోన్నతిపై వచ్చిన డీఎంహెచ్‌వో పనితీరుపై నిరసన వ్యక్తం చేయడంతో పాటు తమను ఇబ్బందులకు గురిచేస్తున్నారని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఆమెను డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌కు సరెండర్‌ చేస్తూ దోమకొండ డిప్యూటీ డీఎంహెచ్‌వో చంద్రశేఖర్‌కు ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికైనా విభేదాలు మరిచి పనిచేస్తారో లేదో వేచి చూడాలి.

అనుకూలం.. వ్యతిరేకం

జిల్లా వైద్యశాఖ సిబ్బంది రెండు వర్గాలుగా విడిపోయినట్లు తెలుస్తోంది. కొందరు ఇన్‌ఛార్జి డీఎంహెచ్‌వోకు అనుకూలంగా ఉండగా మరికొందరు వ్యతిరేకంగా ఉన్నారు. ఒకవర్గం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటే.. మరొక వర్గం సహాయ నిరాకరణ చేస్తోంది. వెరసి క్షేత్రస్థాయిలో నిరుపేదలకు వైద్యసేవలు మృగ్యమవుతున్నాయి.

ఆర్థిక లావాదేవీలే కారణమా..

కొందరు సిబ్బంది నిబంధనలకు విరుద్ధంగా తమ సొంత వాహనాలను అద్దెకు పెట్టారు. ప్రైవేటు ఆసుపత్రులకు అనుమతుల మంజూరులో చేతివాటం ప్రదర్శిస్తున్నారు. వీటి వల్లే కార్యాలయంలో పనిచేసే సిబ్బంది మధ్య పొరపొచ్చాలొచ్చినట్లు సమాచారం. ఉన్నతాధికారులు లావాదేవీలపై ప్రత్యేక నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది.

ప్రత్యేక చొరవ చూపితేనే..

ప్రైవేటు ఆస్పత్రులతో పాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అందుతున్న వైద్యసేవలపై నిరంతరం పర్యవేక్షించి సమీక్షించాల్సిన అధికారులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. జిల్లాకేంద్రంలోని ప్రైవేటు ఆసుపత్రిలో లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తుండగా.. హైదరాబాద్‌ నుంచి వైద్య బృందం వచ్చి పట్టుకుంది. తక్షణమే జిల్లావ్యాప్తంగా ప్రైవేటు ఆస్పత్రులు, ల్యాబులపై ప్రత్యేక నిఘా పెట్టాలని రాష్ట్రశాఖ అధికారులు నిర్దేశించారు. అయినా చర్యలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఇందు కోసం ప్రత్యేకంగా ఓ వైద్యురాలిని నియమించినప్పటికీ తనిఖీలు మాత్రం కొనసాగడం లేదు. ప్రయోగశాలల్లో నిర్దేశిత రుసుం కంటే అధికంగా వసూలు చేస్తున్నారు. అనుమతులు లేకుండానే బిచ్కుంద, మద్నూర్‌, పిట్లం మండల కేంద్రాల్లో ఆర్‌ఎంపీలే వైద్యశాలలను నెలకొల్పి చికిత్సలు చేస్తున్నారు. అమాయక ప్రజలను అందినకాడికి దండుకుంటున్నారు. పాలనాధికారి ప్రత్యేక చొరవ తీసుకొంటేనే శాఖ గాడిలో పడి ప్రజలకు మెరుగైన వైద్య సేవలందుతాయి.

Read latest Nizamabad News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని