logo

2.30 లక్షల మె.ట.ధాన్యం కొనుగోలు

జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఐకేపీ, పీఏసీఎస్‌, మెప్మా ఆధ్వర్యంలో మొదట 480 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా.. 411 కేంద్రాలు ప్రారంభించి ఇప్పటి వరకు 2.30 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి.. రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది

Published : 23 Apr 2024 06:55 IST

 


నిజామాబాద్‌ కలెక్టరేట్‌, న్యూస్‌టుడే : జిల్లాలో ధాన్యం సేకరణ ప్రక్రియ కొనసాగుతోంది. ఐకేపీ, పీఏసీఎస్‌, మెప్మా ఆధ్వర్యంలో మొదట 480 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా.. 411 కేంద్రాలు ప్రారంభించి ఇప్పటి వరకు 2.30 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి.. రాష్ట్రంలో ప్రథమ స్థానంలో నిలిచింది. 1.94 లక్షల మె.టన్నులతో నల్గొండ ద్వితీయ, 89 వేల మె.ట.తో సూర్యాపేట తృతీయ స్థానంలో నిలిచాయి. జిల్లాలో 33,676 మంది రైతుల నుంచి ధాన్యం సేకరించారు. 1.30 లక్షల మె.ట. ధాన్యం ట్యాబ్‌లో నమోదు చేయగా.. రూ.287.74 కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేశారు. సేకరించిన వడ్లను మిల్లులకు పంపిస్తున్నారు. గన్నీ సంచుల, హమాలీల కొరత లేదని.. రానున్న రోజుల్లో మరింత వేగంగా కొనుగోలు చేస్తామని అధికారులు చెబుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని