logo

తగ్గని భానుడి ప్రతాపం

జిల్లాలో భానుడి ప్రతాపం కొనసాగుతోంది. వరుసగా పగటిపూట ఎండలు దంచికొడుతున్నాయి. ఆదివారం గరిష్ఠంగా నిజామాబాద్‌ ఉత్తరంలో 46.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇందూరు నగరం రెడ్‌జోన్‌లోకి వెళ్లింది. ఇక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రత సైతం రికార్డు స్థాయిలో 36.1 డిగ్రీలు ఉండటం గమనార్హం.

Published : 06 May 2024 04:35 IST

అర్బన్‌లో అత్యధికంగా 46.2 డిగ్రీలు నమోదు
న్యూస్‌టుడే, నిజామాబాద్‌ వ్యవసాయం

జిల్లాలో భానుడి ప్రతాపం కొనసాగుతోంది. వరుసగా పగటిపూట ఎండలు దంచికొడుతున్నాయి. ఆదివారం గరిష్ఠంగా నిజామాబాద్‌ ఉత్తరంలో 46.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇందూరు నగరం రెడ్‌జోన్‌లోకి వెళ్లింది. ఇక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రత సైతం రికార్డు స్థాయిలో 36.1 డిగ్రీలు ఉండటం గమనార్హం. వేంపల్లి, బెల్లాల్‌లో 44.9, కొరట్‌పల్లి, ముప్కాల్‌, జాకోరాలో 44.7, ఎడపల్లిలో 44.5, వేల్పూర్‌, మోర్తాడ్‌లో 44.4, నిజామాబాద్‌ దక్షిణం, కమ్మర్‌పల్లిలో 44.1, బాల్కొండ, కల్దుర్కిలో 43.9, రెంజల్‌, జక్రాన్‌పల్లి, పెర్కిట్‌లో 43.8, జానకంపేట్‌, భీమ్‌గల్‌, మోస్రాలో 43.7, మగ్గిడి, ఏర్గట్ల, కోటగిరిలో 43.6, కోనసముందర్‌, ఇస్సాపల్లిలో 43.3, చిన్నమావంది, మెండోరా, గూపన్‌పల్లిలో 43.2, మల్కాపూర్‌, లక్నాపూర్‌లో 43.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని