logo

ఎంపీగా ఓటమి.. ఎమ్మెల్యేగా గెలుపు

ఉమ్మడి జిల్లాలో కొంతమంది నాయకులు మొదట లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందారు.

Published : 07 May 2024 06:01 IST

ఉమ్మడి జిల్లాలో కొంతమంది నాయకులు మొదట లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి చెందారు. కానీ తర్వాత శాసనసభ పోటీలో నిలిచి గెలిచిన నాయకులు ఉన్నారు. వారిలో.. మాజీ సభాపతి, ప్రస్తుత బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఎంపీగా 1989లో తెదేపా అభ్యర్థిగా అప్పటి కాంగ్రెస్‌ అభ్యర్థి బాలాగౌడ్‌పై పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం 1994లో బాన్సువాడ శాసనసభ బరిలో నిలిచి విజయం సాధించారు. 2009లో నిజామాబాద్‌ లోక్‌సభ నుంచి తెరాస అభ్యర్థిగా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా అప్పటి కాంగ్రెస్‌ అభ్యర్థి మధుయాస్కీగౌడ్‌పై ఓటమి చెందారు. తిరిగి ఆయన 2014 శాసనసభ ఎన్నికల్లో తెరాస అభ్యర్థిగా నిజామాబాద్‌ అర్బన్‌ నుంచి పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుత ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్‌మోహన్‌రావు 2019 ఎన్నికల్లో జహీరాబాద్‌ లోక్‌సభ కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేసి అప్పటి తెరాస అభ్యర్థి బీబీపాటిల్‌పై ఓటమి చెందారు. తిరిగి ఆయన 2023 అసెంబ్లీ ఎన్నికలో ఎల్లారెడ్డి నుంచి పోటీ చేసి గెలిచారు. 

న్యూస్‌టుడే, బాన్సువాడ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని