logo

11న సాయంత్రం 5 గంటలకు ప్రచారం సమాప్తం

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పోటీ చేసే అభ్యర్థులు ప్రచారం హోరెత్తిస్తున్నారు.

Published : 07 May 2024 06:02 IST

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పోటీ చేసే అభ్యర్థులు ప్రచారం హోరెత్తిస్తున్నారు. పోలింగ్‌ సమయం సమీపిస్తున్న నేపథ్యంలో ఏదో ఒక రూపంలో ఓటర్లను కలిసి అభ్యర్థిస్తున్నారు. ప్రధాన పార్టీలైన భాజపా, కాంగ్రెస్‌, భారాస ప్రచార వాహనాలు వీధుల్లో తిరుగుతున్నాయి. ఆయా పార్టీలకు చెందిన నాయకులు ఇంటింటికి తిరిగి తమ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని కోరుతున్నారు. స్వతంత్ర అభ్యర్థులు సైతం తమ ప్రచారం కొనసాగిస్తున్నారు. మే 13న పోలింగ్‌ ఉన్నందున 48 గంటల ముందుగానే ప్రచారం ముగించాలి. ఈ నెల 11న సాయంత్రం 5 గంటల వరకు మైకులు కట్టేయాలి. పార్టీ కండువాలు వేసుకొని తిరగొద్దు. ఎన్నికల నిబంధనలు ఎవరైనా విస్మరిస్తే ఎన్నికల   సంఘం కఠిన చర్యలు తీసుకోనుంది.

న్యూస్‌టుడే, నిజామాబాద్‌ అర్బన్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని