logo

ఉత్సాహంగా వేసవి శిబిరం

ఎండలను లెక్కచేయకుండా విద్యార్థులు వేసవి శిబిరాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కూచిపూడి,  భరత నాట్యం, బృంద చర్చల్లో ఎలా రాణించాలి, నైతిక విలువల పెంపు, కర్రసాము తదితర అంశాల్లో శిక్షణ పొందుతున్నారు.

Published : 07 May 2024 11:14 IST

కామారెడ్డి పట్టణం: ఎండలను లెక్కచేయకుండా విద్యార్థులు వేసవి శిబిరాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కూచిపూడి,  భరత నాట్యం, బృంద చర్చల్లో ఎలా రాణించాలి, నైతిక విలువల పెంపు, కర్రసాము తదితర అంశాల్లో శిక్షణ పొందుతున్నారు. శిక్షకులు పిల్లలను ఉన్నతులుగా తీర్చిదిద్దేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. జిల్లా కేంద్రంలోని సరస్వతీ శిశుమందిర్ పాఠశాలలో వేసవి శిబిరానికి నిత్యం వందలాది మంది విద్యార్థులు వస్తున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అక్కడే ఉండి శిక్షణ పొందుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని